AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: బయటకు వచ్చేసిన ప్రియాంక.. ఒక్కొక్కరి గురించి ఏం చెప్పిందంటే..

బిగ్‏బాస్ సీజన్ 5 పదవ మూడవ వారం గడిచిపోయింది. ఇక ఈ వారం ఇంటి నుంచి బయటకు వచ్చేసింది ప్రియాంక. ఇక నిన్నటి

Bigg Boss 5 Telugu: బయటకు వచ్చేసిన ప్రియాంక.. ఒక్కొక్కరి గురించి ఏం చెప్పిందంటే..
Priyanka
Rajitha Chanti
|

Updated on: Dec 06, 2021 | 6:52 AM

Share

బిగ్‏బాస్ సీజన్ 5 పదవ మూడవ వారం గడిచిపోయింది. ఇక ఈ వారం ఇంటి నుంచి బయటకు వచ్చేసింది ప్రియాంక. ఇక నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ స్జేజీ పైకీ రావడంతో ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడించాడు నాగ్. ఇంట్లో సభ్యులకు ఒక్కో ఫేమస్ ఫేసెస్ స్క్రీన్ పై చూపించి ఎవరికి సెట్ అవుతుందో చెప్పాలన్నాడు. ఇక ఆ తర్వాత.. మానస్, కాజల్ సేఫ్ అయినట్లు ప్రకటించాడు నాగ్.

ఇక ఆ తర్వాత ఇంటి సభ్యులతో లూడో గేమ్ ఆడించాడు. అందులో రెడ్ వస్తే పనిష్మెంట్, బ్లూ వస్తే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని.. గ్రీన్ వస్తే సేఫ్ అంటూ చెప్పారు. ఇందులో ఎక్కువగా బ్లూ రావడంతో షణ్ముఖ్ కు టాప్ 5లో ఎవరు ఉండరని అనుకుంటున్నావని ప్రశ్నించగానే.. కాజల్ పేరు చెప్పాడు షన్నూ. ఇక చివరగా.. సిరి సేఫ్ అయినట్టు, ప్రియాంక ఎలిమినేట్ అయినట్టుగా ప్రకటించాడు నాగార్జు. అనంతరం బయటకు వచ్చిన ప్రియాంక ఇంటి సభ్యుల గురించి మనసులోని మాటలను బయటపెట్టింది. ఇక సిరిని ఇంట్లోకి రాగానే గోల్డ్ కలర్ డ్రెస్సులో కనిపించింది. ఇదేంటి నాకంటే అందంగా ఉందని అనుకున్నాను.. సిరిని నా చెల్లిగా చూస్తాను అని తెలిపింది. ఇక శ్రీరామచంద్ర గురించి చెప్తూ.. మై డియర్ రైట్ ఐ.. ఫస్ట్ డే వైట్ కలర్ డ్రెస్ లో వచ్చారు. శ్రీరామచంద్రకు.. అతని పాటకు పెద్ద అభిమానిని.. శ్రీరామచంద్రను శ్రీకృష్ణుడిని చెద్దామనుకున్నాను. కానీ రాముడిలాగే ఉండిపోయాడు అని చెప్పింది ప్రియాంక.

ఇక షణ్ముఖ్ చిన్నపిల్లాడు అనుకున్నానని.. తమ్ముడు అని పిలవాలనుకున్నానని.. కానీ ముదిరిపోయిన బెండకాయ అని తెలిసి అన్నయ్య అని పిలిచానని చెప్పింది. ఇక సన్నీ అన్నయ్య విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నట్లుగా చెప్పింది. ఇక కాజల్ ను మొదటి సారి చూడగానే.. ఇంత అల్లరి చేస్తుందేంట్రా అనుకున్నాను.. కానీ అలాగే అల్లరి చేయాలని కోరింది. ఇక మానస్ ను మొదటి రోజు మాట్లాడిస్తే మాట్లాడలేదని.. ఇంత పొగరేంటీ అనుకున్నాను.. ఎప్పటికీ మాట్లాడవద్దు అనుకున్నాను.. కానీ తర్వాత మంచి ఫ్రెండ్స్ అయ్యాం అని చెప్పింది. ఇక మానస్ విన్నర్ కావాలనుకుంటున్నట్లుగా మనసులోని మాటను చెప్పింది. దీంతో ప్రియాంక కోసం మానస్.. ఉప్పెనంత ప్రేమకు అనే పాట పాడాడు. ఆ తర్వాత ప్రియా ప్రియా చంపొద్దే అంటూ పాట పాడాడు శ్రీరామచంద్ర.

Also Read: Balayya Talk Show: బాలకృష్ణ టాక్‌షోలో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు సందడి.. ఫోటోలు వైరల్‌..!

Ritu Varma: వయ్యారి భామకు వరుస కడుతున్న ఆఫర్లు.. తమిళ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..