బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు.. కాసేపట్లో అఖిలప్రియకు కరోనా పరీక్షలు.. మధ్యాహ్నం న్యాయమూర్తి ఎదుట హాజరు..
Bowenpally Kidnap Case: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ కస్టడీ గురువారం మధ్యాహ్నంతో ముగుస్తుంది. ఈ నేపధ్యంలో ఆమెకు...
Bowenpally Kidnap Case: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ కస్టడీ గురువారం మధ్యాహ్నంతో ముగుస్తుంది. ఈ నేపధ్యంలో ఆమెకు బేగంపేటలోని పాటిగడ్డ ప్రైమరీ హెల్త్ కేర్‌లో కరోనా పరీక్షలు నిర్వహించి.. అనంతరం పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. మూడు రోజుల విచారణలో భాగంగా అఖిలప్రియను పోలీసులు 300 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
ఇక ఈ కేసులో ప్రధాన నిందితులైన భార్గవరామ్, గుంటూరు శ్రీనులను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కచ్చితమైన సమాచారంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. వీరికి సంబంధించిన కీలక ఆధారాలతో వెతుకుతున్నారు. భార్గవరామ్ మహారాష్ట్రలో, గుంటూరు శ్రీను కర్ణాటకలో ఉన్నట్లు సమాచారం లభించడంతో ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లాయి. ఈ నెల 5న ప్రవీణ్‌రావు సోదరులను కిడ్నాప్ చేయించిన వీరిద్దరూ మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకున్న సంగతి తెలిసిందే.