Guntur District: విషాదం.. బావ హత్యను తట్టుకోలేక ఆగిన బావమరిది గుండె.. గ్రామంలో విషాద ఛాయలు
Guntur District: గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ నేత, కాపు నాయకుడు, మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకులును ప్రత్యర్థుల చేతిలో దారుణ ...
Guntur District: గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ నేత, కాపు నాయకుడు, మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకులును ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణాన్ని తట్టుకోలేక సమీప బంధువు, బావమరిది యడ్లవల్లి శ్రీనివాస్ (45) కూడా సోమవారం రాత్రి గుండె ఆగి మరణించాడు. శ్రీనివాస్, ఆంకులుకు స్వయానా బావమరిది. బావ మరణంతో తీవ్రంగా కతలచెంది కన్నీరు మున్నీరైన శ్రీనివాస్‌కు గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అంకులు అంత్యక్రియలు జరిగిన తర్వాత బావమరిది శ్రీనివాసరావు మృతి చెందడం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read:
డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న తారల అరెస్ట్ పర్వం..ముంబైలో పట్టుబడిన కన్నడ నటి శ్వేతా కుమారి