Bank of Baroda: ఆ ఉద్యోగులపై వేటు పడింది.. అక్రమార్కుల గుట్టు వీడుతోంది.. చర్యలు తీసుకుంటున్న బ్యాంక్ అధికారులు..
BoB: కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన కుంభకోణంలో చర్యలకు సిద్ధమయ్యారు బ్యాంక్ అధికారులు. అక్రమాల్లో చేయి తిరిగిన మెసెంజరు ఆలీఖాన్, అతనితో కుమ్మక్కయిన బ్యాంకు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు.
కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన కుంభకోణంలో చర్యలకు సిద్ధమయ్యారు బ్యాంక్ అధికారులు. అక్రమాల్లో చేయి తిరిగిన మెసెంజరు ఆలీఖాన్, అతనితో కుమ్మక్కయిన బ్యాంకు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. టీవీ9లో ప్రచూరించిన కథనంకు అధికారులు వేగంగా స్పందించారు. అక్కడ జరుగుతున్న అక్రమాలపై ఫోకస్ పెట్టారు. అక్రమాల గుట్టును రట్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. రీజనల్ కార్యాలయానికి చెందిన ఐదుగురు బ్యాంకు అధికారులు తనిఖీలు జరిపారు. వివిధ రకాల ఖాతాల్లో లావాదేవీలను పరిశీలించి వెళ్ళారు. తిరిగి జోనల్ కార్యాలయానికి చెందిన మరో నలుగురు ఉన్నతాధికారులు వీటిలో కొన్నింటిని పరిశీలించి ప్రాథమికంగా నలుగురిని సస్పెండ్ చేసేందుకు సిఫారసు చేసిన దరిమిలా బ్యాంక్ ఉన్నతాధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
మెసెంజరు ఆలీఖాన్ జరిపిన అక్రమ లావాదేవీల్లో కొందరు బ్యాంక్ ఉద్యోగుల లాగిన్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు యథేచ్ఛగా ఉపయోగించినట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరు గాక ముగ్గురు మేనేజర్లతో పాటు ఆరుగురు ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్లు అనుమా నిస్తున్నారు.
కుంభకోణం బయట పడిన వెంటనే వీరిలో జయకృష్ణను శ్రీకాళహస్తికి, ఈశ్వరన్‌ను గుంతకల్లుకు బదిలీ చేశారు. వీరితోపాటు మేనేజరు వెంకట్‌ను కర్ణాటకకు బదిలీ చేశారు. దాదాపు ఆరేళ్ళ నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాలో కుంభకోణం జరుగుతున్నట్లు వెల్లడవుతోంది.
మెసెంజరు ఆలీఖాన్ తో కుమ్మక్కైన బ్యాంకు ఉద్యోగులు రూ.కోట్లు కొల్లగొట్టినట్లు బ్యాంకు ఉన్నతాధికారులే అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. వీరు గాక ముగ్గురు మేనేజర్లతో పాటు ఆరుగురు ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్లు అనుమా నిస్తున్నారు
డిపాజిట్లు, రుణాల చెల్లింపులు, రుణాల మంజూరు, డ్వాక్రా గ్రూపుల నిధుల తారుమారు, బంగారు తాకట్టు రుణాలు ఇలా దొరికినన్ని మార్గాల్లో అక్రమాలకు పాల్పడడంతో అసలు ఎన్ని కోట్ల రూపాయలు స్వాహా జరిగిందో కూడా అంచనాకు రాలేకపోతున్నట్లు చెబుతున్నారు.
“BoB Kalikiri: డిపాజిటర్ల సొమ్ము మాయం.. భార్య ఖాతాల్లోకి మళ్లించిన బ్యాంక్ ఉద్యోగి..“
ఇవి కూడా చదవండి: Pig Farming: బ్యాంక్ ఉద్యోగం వదిలి పెట్టాడు.. మెలకువలు నేర్చుకున్నాడు.. లక్షలు సంపాదిస్తున్నాడు.. ఇది ఎలా సాధ్యమైందో తెలుసా..