ఫ్లాష్: అత్యాచార నిందితులకు బెయిల్ మంజూరు
వెటర్నరీ డాక్టర్ దిశ ఉదంతం తర్వాత మహిళలపై అత్యాచారం చేసిన వాళ్లను ఉరి తీయాలని డిమాండ్లు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నిర్భయ దోషులను కూడా ఈ నెలలోనే ఉరి తీయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఊహించని విధంగా ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంగళూరు జిల్లా పుత్తూరులో కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ కేసులోని ప్రధాన నిందితులైన గురునందన్, […]
వెటర్నరీ డాక్టర్ దిశ ఉదంతం తర్వాత మహిళలపై అత్యాచారం చేసిన వాళ్లను ఉరి తీయాలని డిమాండ్లు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నిర్భయ దోషులను కూడా ఈ నెలలోనే ఉరి తీయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఊహించని విధంగా ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంగళూరు జిల్లా పుత్తూరులో కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ కేసులోని ప్రధాన నిందితులైన గురునందన్, ప్రజ్వల్, కిషన్, సునీల్, ప్రఖ్యాత్‌లకు బెయిల్ లభించింది.
ఇంటికి తీసుకెళ్తామంటూ తోటి విద్యార్థినిపై ఈ ఐదుగురు మృగాళ్లు మార్గం మధ్యలో కదులుతున్న కార్‌లో రేప్ చేశారు. ఇక ఈ అమానుష ఘటనను వీరంతా వీడియో తీసి ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా అనుకోని విధంగా ఆ వీడియో వైరల్ కావడంతో.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇక పోలీసులు కేసును నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. కాగా, ఇప్పుడు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నిరసనలు మిన్నంటాయి.