AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cctv visuals: ఒకరు ఏటీఎం కొల్లగొట్టేపనిలో, మరొకరు గోల్డ్ షాపులో మస్కా. సీసీ కెమెరాల్లో చిక్కిన రెండు చోరీలు

కృష్ణా జిల్లా నూజివీడులో పట్టపగలే దొంగలు హల్చల్ చేశారు. నూజివీడు మున్సిపల్ ఆఫీస్ దగ్గరున్న ఎస్‌బీఐ ఏటీయం పగులగొట్టి దోచుకునేందుకు విఫలయత్నం చేశారు. కేవలం బనియన్, నిక్కరు ధరించి

Cctv visuals: ఒకరు ఏటీఎం కొల్లగొట్టేపనిలో, మరొకరు గోల్డ్ షాపులో మస్కా. సీసీ కెమెరాల్లో చిక్కిన రెండు చోరీలు
Cctv
Venkata Narayana
|

Updated on: Aug 10, 2021 | 4:40 PM

Share

Theft Caught On Cctv: కృష్ణా జిల్లా నూజివీడులో పట్టపగలే దొంగలు హల్చల్ చేశారు. నూజివీడు మున్సిపల్ ఆఫీస్ దగ్గరున్న ఎస్‌బీఐ ఏటీయం పగులగొట్టి దోచుకునేందుకు విఫలయత్నం చేశారు. కేవలం బనియన్, నిక్కరు ధరించి, ఏటీఎంలోకి మాస్క్ పెట్టుకుని ప్రవేశించిన ఒక యువకుడు ఏటీఎం తెరిచి నగదు దొంగిలించేందుకు విఫలయత్నం చేశాడు. ఎంత ప్రయత్నించినా ఏటీఎం డోర్లు తెరుచుకోకపోవడంతో చివరికి చేసేది లేక ఉడాయించాడు ఆ దొంగ. దొంగ ప్రయత్నాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఇక అదే నూజివీడు పట్టణంలో ఇవాళే మరో చోరీ బయటపడింది. జ్యువెలరీ షాపులో గోల్డ్ చైన్ కోట్టేశాడు మరో దొంగ. సదరు కేటుగాడు దొంగతనానికి పాల్పడ్డ తీరంతా షాపులో ఉంచిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. బంగారం షాపులోని యజమాని దృష్టి మరల్చి ఐదు కాసుల గొలుసు ఇట్టే దోచేశాడీ కిలాడీ. అందిన ఫిర్యాదుల మేరకు రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న నూజివీడు పోలీసులు నిందితుల కోసం గాలింపు షురూ చేశారు.

Read also: AP Schools re-open: ఏపీలో 16న మోగనున్న బడి గంటలు.. ఆఫ్ లైన్లో పూర్తి స్థాయిలో పాఠశాలు