AP Schools re-open: ఏపీలో 16న మోగనున్న బడి గంటలు.. ఆఫ్ లైన్లో పూర్తి స్థాయిలో పాఠశాలు

ఆంధ్రప్రదేశ్ లోని విద్యార్థులు, తల్లిదండ్రులకు ముఖ్య గమనిక. ఈ నెల 16వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో బడి గంటలు మోగనున్నాయి. 16వ తేదీ నుంచి ఆఫ్ లైన్లోనే పూర్తి స్థాయిలో పాఠశాలు తెరుస్తామని..

AP Schools re-open: ఏపీలో 16న మోగనున్న బడి గంటలు.. ఆఫ్ లైన్లో పూర్తి స్థాయిలో పాఠశాలు
Ap Schools
Follow us

|

Updated on: Aug 10, 2021 | 3:16 PM

School Education – Classes: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు, తల్లిదండ్రులకు ముఖ్య గమనిక. ఈ నెల 16వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో బడి గంటలు మోగనున్నాయి. 16వ తేదీ నుంచి ఆఫ్ లైన్లోనే పూర్తి స్థాయిలో పాఠశాలు తెరుస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇవాళ అమరావతిలో ప్రకటించారు. ఏపీలో స్కూళ్లను రీ-ఓపెన్ చేస్తున్నామని తెలిపిన ఆయన, ఎప్పటి మాదిరే రెగ్యులర్ టైమింగ్సులోనే స్కూళ్లను రన్ చేస్తామని వెల్లడించారు.

“కొవిడ్ ప్రొటోకాల్ పాటించేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం మంది టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తైంది. వ్యాక్సిన్ వేయించుకోని మిగిలిన టీచర్లకు కూడా టీకాలు వేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించాం. ఆన్ లైన్ తరగతులు రాష్ట్రంలో ఎక్కడా జరగడం లేదు.” అని మంత్రి స్పష్టం చేశారు.

ప్రైవేట్ పాఠాశాలల్లో ఆన్ లైన్ తరగతులు నడపొద్దని ఆదేశించిన విషయాన్ని గుర్తుచేసిన మంత్రి.. ఈ నెల 16వ తేదీ నుంచి కేవలం తరగతి గదుల్లోనే పూర్తి పని గంటల్లో పాఠశాలలను నిర్వహిస్తామని చెప్పారు.

Read also: కృష్ణా జిల్లాలో విద్యుత్ పోల్ వేసేందుకు గొయ్యి తవ్వుతుండగా.. గుండె ఆగినంత పనైంది.!