AP High Court: ఇద్దరు ఐఏఎస్‌ అధికారులకు ఊహించని షాక్.. తీర్పును అమలు చేయలేదని శిక్ష.. ఆ తర్వా రీ కాల్..

 ఏపీలోని ఇద్దరు ఐఏఎస్‌ అధికారులకు ఏపీ హైకోర్టు ఊహించని శిక్ష వేసింది. హైకోర్టు తీర్పును అమలు చేయలేదని వారికి జైలు శిక్ష విధించింది. హైకోర్టు తీర్పును అమలు చేయలేదని దాఖలైన పిటిషన్‌...

AP High Court: ఇద్దరు ఐఏఎస్‌ అధికారులకు ఊహించని షాక్.. తీర్పును అమలు చేయలేదని శిక్ష.. ఆ తర్వా రీ కాల్..
AP HC
Follow us

|

Updated on: Jun 22, 2021 | 6:27 PM

ఏపీలోని ఇద్దరు ఐఏఎస్‌ అధికారులకు ఏపీ హైకోర్టు ఊహించని శిక్ష వేసింది. హైకోర్టు తీర్పును అమలు చేయలేదని వారికి జైలు శిక్ష విధించింది. అయితే.. ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు వారం రోజుల జైలు శిక్ష ఆదేశాలను హైకోర్టు రీ కాల్ చేసింది. కోర్టు ఆదేశాలు అమలు చేస్తామని అధికారులు కోర్టుకు చెప్పండంతో జైలు శిక్షను రద్దు చేస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు తీర్పును అమలు చేయలేదని దాఖలైన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం మంగళవారం విచారణ నిర్వహించింది.  ఈ కేసులో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్‌ కోర్టుకు హాజరయ్యారు. విచారణ చేసిన హైకోర్టు వారిద్దరికీ వారం రోజుల పాటు జైలు శిక్ష వేసింది.

36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ ఏప్రిల్‌లో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో  ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర్వులు అమలు చేయాలంటూ పలుమార్లు ఆదేశించినప్పటికీ బేఖాతరు చేయడంతో IAS అధికారి గిరిజా శంకర్, IFS అధికారి చిరంజీవి చౌదరికి కోర్టు వారం రోజులపాటు జైలు శిక్ష విధించింది.

నేటి విచారణకు అధికారులు ఇద్దరు వ్యక్తిగతంతా హాజరయ్యారు. విచారణ సందర్భంగా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఉత్తర్వులను పెడచెవిన పెట్టినందుకు గాను ఇద్దరికీ చెరో వారం రోజులు జైలు శిక్ష విధించింది.

మంగళవారం విచారణకు అధికారులు ఇద్దరు వ్యక్తిగతంగా హాజరయ్యారు. విచారణ సందర్భంగా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఉత్తర్వులను పెడచెవిన పెట్టినందుకు గాను ఇద్దరికీ చెరో వారం రోజులు జైలు శిక్ష విధించింది.

ఇవి కూడా చదవండి : Defamation Case: మాజీ ప్రధానికి షాక్.. పరువు నష్టం కేసులో భారీ జరిమానా..

IND Vs NZ, WTC Final 2021 Day 5th Live: వర్షం కారణంగా ఒక గంట ఆలస్యం.. మొదలైన ఐదో రోజు ఆట