AP Crime News: మహిళపై అత్యాచారయత్నం.. హత్య చేసిన వ్యక్తిని కొట్టి చంపిన గ్రామస్థులు..ఎక్కడంటే ఎక్కడంటే
AP Crime News: ఎన్ని చట్టాలు వచ్చినా మహిళపై జరుగుతున్న అత్యాచారాలకు అంతేలేకుండా పోతుంది. తాజాగా పసరు వైద్యం పేరుతో మహిళను వివస్త్రను చేసి..
AP Crime News: ఎన్ని చట్టాలు వచ్చినా మహిళపై జరుగుతున్న అత్యాచారాలకు అంతేలేకుండా పోతుంది. తాజాగా పసరు వైద్యం పేరుతో మహిళను వివస్త్రను చేసి అత్యాచారయత్నం చేశాడో ప్రబుధ్దుడు..ఆమె ప్రతిఘటించడంతో దారుణంగా నరికి చంపాడు.. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆగ్రహంతో నాటువైద్యుడ్ని చేతులు కట్టేసి కర్రలు, రాళ్ళతో కొట్టి చంపేశారు.. అడ్డువచ్చిన పోలీసులను పక్కకు తోసేసి, జీపులో ఉన్న నిందితుడ్ని కొందకు లాగి మరీ దారుణంగా చంపేశారు.. ప్రకాశంజిల్లా కామేపల్లిలో జరిగిన ఈ జంట హత్యల సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..
ప్రకాశంజిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. పసరు వైద్యంతో మోకాలి నొప్పులకు వైద్యం చేస్తానని నమ్మించి ఓ మహళను ఇంట్లోకి రప్పించి కాళ్ళూ చేతులు కట్టేసి అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు ఓ నాటు వైద్యుడు… మహిళ తీవ్రంగా ప్రతిఘటించడతో గొడ్డలితో నరికి చంపాడు…. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అతన్ని కర్రలతో, రాళ్ళతో అంతకంటే దారుణంగా కొట్టి చంపేశారు…. జిల్లాలోని కామేపల్లి గ్రామానికి చెందిన వంకాయలపాటి విజయలక్ష్మి ఆదివారం సాయంత్రం కామేపల్లిలోని వడ్డెపాలెం వెళ్ళింది. వ్యవసాయ పనుల కోసం కూలీలను పిలుస్తుండగా అదే కాలనీకి చెందిన వల్లెపు ఓబయ్య(51) ఈ విషయాన్ని గమనించాడు. ఆమెను పలకరించి మాటలు కలిపాడు. అనంతరం మోకాళ్ల నొప్పులకు మందులిస్తాను రమ్మంటూ ఆమెను ఇంటికి పిలిచాడు. ఓబయ్య మాటలను లోపలకు వెళ్లిన విజయపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బిత్తరపోయిన విజయలక్ష్మి తీవ్రంగా ప్రతిఘటించి గట్టిగా కేకలు వేసింది. విషయం బయటకు వస్తే తాను ఇబ్బందులు పడతానని భావించిన ఓబయ్య ఆమెపై దాడి చేశాడు. కాళ్లు, చేతులు కట్టేసి గొడ్డలితో నరికి చంపాడు.
ఓబయ్య ఇంట్లోనుంచి కేకలు వినిపించడంతో చుట్టుపక్కల ఇళ్ళల్లోని వారు వెంటనే జరుగుమల్లి పోలీసులకు వారు సమాచారం ఇచ్చారు. జరుగుమల్లి ఎస్సై రజియా సుల్తానా హుటాహుటిన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విజయ రక్తపు మడుగులో ఒంటిపై బట్టలు లేకుండా పడి ఉండటం గమనించారు… వెంటనే ఓబయ్యను అదుపులోకి తీసుకుని పోలీసు జీపులో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించారు…విజయను దారుణంగా హత్య చేసిన ఓబయ్య ఆగ్రహంతో ఊగిపోతున్న గ్రామస్థులు ఒక్కసారిగా నిందితుడిపై దాడి చేశారు. పోలీసు వాహనంలో ఉన్న ఓబయ్యను బయటికి లాగి మరీ కొట్టారు. అడ్డుకోబోయిన ఎస్సై రజియాను పక్కకు తోసేశారు… దీంతో ఖంగుతిన్న ఎస్‌ఐ రజియా నిందితుడ్ని గ్రామస్థుల బారి నుంచి కాపాడేందుకు విశ్వప్రయత్నం చేశారు… అయితే సిబ్బంది తక్కువగా ఉండటంతో ఎస్‌ఐ అసహాయస్థితిలో ఉండిపోయారు… దీంతో పోలీసుల ఎదుటే జరిగిన గామస్తుల దాడిలో ఓబయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
Also Read: మేమంతా ఒకటే..పవన్ కళ్యాణ్, విష్ణు చాలాసేపు మాట్లాడుకున్నారంటున్న మంచు లక్ష్మి