AP Road Accident: ఏపీలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. చెరువులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. బ్రిడ్జి పైనుంచి పడ్డ లారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పెను ప్రమాదం తప్పింది. అయితే, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
AP Road Accidents: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పెను ప్రమాదం తప్పింది. అయితే, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వైజాగ్‌లో భారీ ప్రాణనష్టం తప్పింది. అతివేగంగా వచ్చిన కంటైనర్ లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. కూర్మన్నపాలెం రామచంద్ర హోటల్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన కంటైనర్ లారీ… బ్రిడ్జి పైనుంచి కాలువలోకి బోల్తాకొట్టింది. అందరూ తమ తమ పనులకు వెళ్తున్న సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. రద్దీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేది. అదృష్టవశాత్తూ డ్రైవర్, క్లీనర్ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
సేమ్ టు సేమ్.. విజయనగరం జిల్లాలోనూ తృటిలో భారీ ప్రాణనష్టం తప్పింది. దత్తిరాజేరు మండలంల మరడాం దగ్గర అతివేగంతో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు చెరువులోకి దూసుకెళ్లింది. విజయనగరం నుంచి సాలూరు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 79మంది ప్రయాణికులు ఉన్నారు. వీళ్లంతా స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో ప్రయాణికులంతా ప్రాణభయంతో పెద్దఎత్తున కేకలు వేయడంతో స్థానికులు స్పందించి కాపాడారు.