Job Cheating: హోంగార్డు ఉద్యోగాల పేరుతో మోసం కేసులో మరో ట్విస్ట్.. పోలీసులకు చిక్కిన ఆ ఇద్దరు..!
నిరుద్యోగులకు హోంగారడ్డు ఉద్యోగం ఎరగా లక్షలు దండుకున్న ఓ ఐపీఎస్ అధికారి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఎ-8 నిందితుడిగా ఐపీఎస్ అధికారి పేరును చేర్చారు పోలీసులు. ప్రస్తుతం వేరే శాఖలో విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారి గతంలో రాష్ట్రంలో వివిధ హోదాలలో పనిచేశారు.

నిరుద్యోగులకు హోంగారడ్డు ఉద్యోగం ఎరగా లక్షలు దండుకున్న ఓ ఐపీఎస్ అధికారి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఎ-8 నిందితుడిగా ఐపీఎస్ అధికారి పేరును చేర్చారు పోలీసులు. ప్రస్తుతం వేరే శాఖలో విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారి గతంలో రాష్ట్రంలో వివిధ హోదాలలో పనిచేశారు.
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు శఠగోపం పెట్టిన కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ కేసులో ఎ-3గా ఉన్న విజయలక్ష్మి పండిట్, ఎ-4గా ఉన్న గొల్లమూడి వెంకట లక్ష్మి నరసింహ ఫణికుమార్‌లను మంగళగిరి పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారించిన అనంతరం మంగళగిరి న్యాయస్థానం మందు హాజరుపరిచారు. న్యాయమూర్తి వీరికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో నిందితులను పోలీసు కస్టడీకి కోరగా కోర్టు అనుమతి నిరాకరించింది. ఇదిలావుంటే తనను అరెస్టు చేయకుండా తదుపరి ఉత్తర్వులు ఇవ్వాలంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి హైకోర్టును ఆశ్రయించడంతో కేసులో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
కేసుకు సంబంధించిన వివరాలను 15 రోజుల్లో ఇవ్వాలంటూ న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి ఎ-8గా ఉన్నారు. కేసు త్వరితగతిన విచారణ చేసి నింధితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
హోంగార్డు రాష్ట్ర అధికారిగా పనిచేసిన సమయంలో హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికారు. 200 మందికిపైగా నిరుద్యోగులు ఒక్కొక్కరి నుంచి రూ.6 నుంచి రూ.7 లక్షలు వసూలు చేశారు. అధికారి ఐజీపీగా ఉన్న సమయంలో కొందరికి హోంగార్డు ఉద్యోగాలు ఇచ్చారు. ఎక్కువ మందికి పోస్టింగులు ఇవ్వలేకపోయారు. దీంతో నిరుద్యోగులు ఒత్తిడి చేయడంతో 2022లో ఐజీపీ హోంగార్డ్స్ పేరుతో తాను పోస్టులో లేకపోయినా తానే ఐజీపీ హోంగార్డు అయినట్లు సంతకాలు చేసి నకిలీ అపాయింట్‌మెంట్లు ఇచ్చారు. వాటితో అభ్యర్థులు పోలీస్ ఉన్నతాధికారులను కలవగా అనుమానం వచ్చి రహస్యంగా విచారణ చేశారు. అవి నకిలీ అపాయింట్‌మెంట్లు అని తేలడంతో నిరుద్యోగులు మోసపోయామని గ్రహించిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
