Viral: క్లాస్ రూంలో పాఠాలు వింటూనే కుప్పకూలిన విద్యార్థి.. ఏం జరిగిందంటే.?
క్లాస్ రూమ్‌లో పాఠాలు వింటూనే కుప్పకూలిపోయాడు ఓ విద్యార్థి. తోటి విద్యార్ధులు గమనించి ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు వదిలేశాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. సాగర్ జిల్లాకు చెందిన రాజా అనే 18 ఏళ్ల విద్యార్ధి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇండోర్‌లో ఉంటున్నాడు. అతను మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం అదే జిల్లాలోని భవర్‌కువాలోని ఓ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాడు. రోజూలాగే గురువారం ఉదయం కూడా కోచింగ్ సెంటర్‌కు వచ్చిన రాజా క్లాస్ రూంలో కూర్చుని పాఠాలు వింటున్నాడు.
క్లాస్ రూమ్‌లో పాఠాలు వింటూనే కుప్పకూలిపోయాడు ఓ విద్యార్థి. తోటి విద్యార్ధులు గమనించి ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు వదిలేశాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. సాగర్ జిల్లాకు చెందిన రాజా అనే 18 ఏళ్ల విద్యార్ధి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇండోర్‌లో ఉంటున్నాడు. అతను మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం అదే జిల్లాలోని భవర్‌కువాలోని ఓ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాడు. రోజూలాగే గురువారం ఉదయం కూడా కోచింగ్ సెంటర్‌కు వచ్చిన రాజా క్లాస్ రూంలో కూర్చుని పాఠాలు వింటున్నాడు. ఈ క్రమంలో రాజా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. ఛాతినొప్పితో విలవిలలాడుతూ కూర్చున్న చోటే కుప్పకూలిపోయాడు. సెకన్ల వ్యవధిలోనే తాను కూర్చున్న కుర్చీలో నుంచి కింద పడిపోయాడు. గమనించిన తోటి విద్యార్ధులు రాజాను పైకిలేపి బెంచ్‌పై కూర్చోబెట్టారు. రాజా అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే రాజా మృతి చెందినట్లు చెప్పారు. క్లాస్ రూంలో అమర్చి ఉన్న సీసీటీవీ ఫుటేజీలో ఈ మొత్తం సంఘటన రికార్డు అయ్యింది. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ యాజమన్యం విద్యార్ధి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి చేరుకున్న మృతుడి తల్లిదండ్రులు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ తమకు పూర్తి స్థాయిలో సీసీటీవీ ఫుటేజీని అందించడం లేదని ఆరోపించారు. విద్యార్థి తండ్రి పీహెచ్‌ఈ విభాగంలో పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

