సూసైడ్ చేసుకునేంత పిరికి వాడు కాదు.. తండ్రి ఆత్మహత్యపై అమృత..

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య మిస్టరీగా మారుతోంది. మారుతీరావు మృతిపై కూతురు అమృత తొలిసారి స్పందించింది. తన తండ్రి సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదంటూ పేర్కొంది. తన విషయంలో పశ్చాత్తాపంతో కాకుండా.. ఇతర కారణాలతో చనిపోయి ఉండొచ్చని తెలిపింది. కేసులో కఠిన శిక్ష పడుతుందనే భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అంతేకాక.. మారుతీరావు కుటుంబంలో ఆస్తి తగాదాలున్నాయని పేర్కొంది. మారుతీరావును శ్రవణ్ కొట్టినట్లు వార్తలు వినిపించాయని.. […]

సూసైడ్ చేసుకునేంత పిరికి వాడు కాదు.. తండ్రి ఆత్మహత్యపై అమృత..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 09, 2020 | 3:22 PM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య మిస్టరీగా మారుతోంది. మారుతీరావు మృతిపై కూతురు అమృత తొలిసారి స్పందించింది. తన తండ్రి సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదంటూ పేర్కొంది. తన విషయంలో పశ్చాత్తాపంతో కాకుండా.. ఇతర కారణాలతో చనిపోయి ఉండొచ్చని తెలిపింది. కేసులో కఠిన శిక్ష పడుతుందనే భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

అంతేకాక.. మారుతీరావు కుటుంబంలో ఆస్తి తగాదాలున్నాయని పేర్కొంది. మారుతీరావును శ్రవణ్ కొట్టినట్లు వార్తలు వినిపించాయని.. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో తాను చెప్పలేనని అమృత వ్యాఖ్యానించింది. ప్రణయ్‌ హత్యకు ముందు మారుతీరావు ఆస్తులు పంచుకోలేదని.. నేను బయటికొచ్చాక ఆస్తులు పంచుకున్నారని పేర్కొంది.