తండ్రి చావును కోరుకుంది.. డబ్బు కోసమే డ్రామాలు: అమృతకు శ్రవణ్ కౌంటర్
తనపై అమృత చేసిన కామెంట్లపై మారుతీరావు సోదరుడు కౌంటర్ ఇచ్చారు. కన్న తండ్రిని చనిపోయే వరకు ఉరి తీయాలని డిమాండ్ చేసిన అమృత.. ఇప్పుడు అడ్డమైన ఆరోపణలు చేస్తుందని ఆయన అన్నారు.
తనపై అమృత చేసిన కామెంట్లపై మారుతీరావు సోదరుడు శ్రావణ్ కౌంటర్ ఇచ్చారు. కన్న తండ్రిని చనిపోయే వరకు ఉరి తీయాలని డిమాండ్ చేసిన అమృత.. ఇప్పుడు అడ్డమైన ఆరోపణలు చేస్తుందని ఆయన అన్నారు. ప్రణయ్ హత్యకు ముందు మారుతీరావుతో తనకు మాటలు లేవని.. అమృత విషయంలోనే గొడవలు జరిగాయని ఆయన చెప్పుకొచ్చారు. తన వల్ల ప్రాణాపాయం ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని శ్రావణ్ తెలిపారు. “తండ్రి చస్తే శుభవార్త” అని అమృత చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
తన సోదరుడు పోయాక ఆయన వెనకాల ఉన్న ఆస్తిపై ప్రేమ పుట్టుకొచ్చిందని.. డబ్బు కోసమే అమృత డ్రామాలు ఆడుతుందని ఆయన ఆరోపించారు. నిన్నటివరకు తండ్రి చావాలని కోరుకున్న అమృతకు ఇప్పుడు ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు. అమృత చేసిన చెత్త పనికే ఇవన్నీ జరిగాయని ఆయన మండిపడ్డారు. నాన్న అని పిలవడానికి కూడా ఆమెకు మాటలు రాలేదని.. తల్లి మీద ప్రేమ ఉంటే నిన్నటి నుంచి ఎందుకు రాలేదని శ్రావణ్ అన్నారు. వాళ్ల అమ్మ దగ్గరకు వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈ సందర్భంగా చెప్పారు. ప్రణయ్ హత్య కేసులో అన్యాయంగా తనను జైలుకు పంపారని.. మళ్లీ ఇప్పుడు తనను చంపడానికి ఏవో ఆరోపణలు చేస్తుందని ఆయన అన్నారు.
Read This Story Also: బాబాయి శ్రావణ్ వల్ల మాకు అపాయం: అమృత