ఇన్ఫోసిస్ లో ‘ఇంటిదొంగలు’.. ముగ్గురి అరెస్ట్

బెంగుళూరులోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదాయం పన్ను చెల్లింపుదారులను వీరు ఛీట్ చేస్తున్నారని, మీకు టాక్స్ రిబేట్స్ లభించేలా చూస్తామని

ఇన్ఫోసిస్ లో 'ఇంటిదొంగలు'.. ముగ్గురి అరెస్ట్
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 09, 2020 | 4:53 PM

బెంగుళూరులోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదాయం పన్ను చెల్లింపుదారులను వీరు ఛీట్ చేస్తున్నారని, మీకు టాక్స్ రిబేట్స్ లభించేలా చూస్తామని ఆశ పెడుతూ డబ్బు డిమాండ్ చేస్తూ వచ్చారని ఖాకీలు తెలిపారు. మీ పన్ను మొత్తంలో 4 శాతం రిబేట్ ఇస్తామని హామీ ఇఛ్చి డబ్బు గుంజినట్టు తెలిసిందని వారు చెప్పారు. ఈ ముగ్గురు ఉద్యోగులను రేణుగుంట కళ్యాణ్ కుమార్, ప్రకాష్, దేవేశ్వర రెడ్డిగా గుర్తించారు. బెంగుళూరు కోర్టు వీరిని 14 రోజుల జుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. ఇన్ఫోసిస్ లో ఐటీ వర్క్ కు సంబంధించిన విభాగంలో పని చేసే వీరికి ఎవరెవరు ఆదాయపన్ను చెల్లింపుదారులో ముందుగానే సమాచారం అందుతుందట. తమకు అందిన సమాచారాన్ని ఈ ఉద్యోగులు టాక్స్ అసెస్ మెంట్ కోసం, తదుపరి ప్రాసెసింగ్ కోసం ఆదాయంపన్ను శాఖకు తెలియజేస్తారని, అదే సమయంలో టాక్స్ పేయర్స్ తో కాంటాక్ట్ లో ఉంటూ వారిని మోసగిస్తారని తెలిసింది. నెల రోజుల్లో సుమారు నాలుగు లక్షలను ఇలా ‘నొక్కేశారని’ వెల్లడైంది. ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ ఇచ్సిన ఫిర్యాదుతో వీరిని.. ఛీటింగ్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ సెక్షన్ల కింద పోలీసులు అరెస్టు చేశారు.