ఒంటరైన మారుతీరావు భార్య.. నేరం ఎవరిది? శిక్ష ఎవరికి!

అటు కన్న కూతురు మోసం.. ఇటు తాళి కట్టిన భర్త.. ఇద్దరూ దూరమై.. ఎవరికి కోసం బ్రతకాలో అర్థంకాని పరిస్థితిలో అమృత తల్లి ఉంది. కులాంతర వివాహం చేసుకుందని.. తమ పరువు పోతుందని భావించిన తండ్రి మారుతీ రావు.. కూతురు భర్త ప్రణయ్‌ని కిరాయి హంతకులతో..

ఒంటరైన మారుతీరావు భార్య.. నేరం ఎవరిది? శిక్ష ఎవరికి!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 09, 2020 | 3:18 PM

అటు కన్న కూతురు మోసం.. ఇటు తాళి కట్టిన భర్త.. ఇద్దరూ దూరమై.. ఎవరికోసం బ్రతకాలో అర్థంకాని పరిస్థితిలో అమృత తల్లి ఉంది. కులాంతర వివాహం చేసుకుందని.. తమ పరువు పోతుందని భావించిన తండ్రి మారుతీ రావు.. కూతురు భర్త ప్రణయ్‌ని దుండగులతో అత్యంత కిరాతకంగా హత్య చేయించాడు. అప్పుడైనా.. కూతురు తమ వద్దకు వస్తుందని ఆశపడ్డాడు.

కానీ.. భర్త మృతి చెందినప్పటికీ.. అమృత అత్తమామల వద్దే ఉంటోంది. తమ వద్దకు రాకపోతుండడంతో.. తీవ్ర మనోవేదనకు గురయ్యాడు మారుతీ రావు. కూతురు వద్దకు ఎన్నిసార్లు రాయబారాలు పంపినా కూడా అమృత పట్టించుకోలేదు. అనంతరం ప్రణయ్ హత్య కేసులో.. దాదాపు 6 నెలలు జైలులోనే ఉన్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత అమృత రాకపోవడంతో మరింత డిప్రెషన్‌కి గురయ్యాడు.

కాగా ఈ లోపు ప్రణయ్ హత్య కేసు హియరింగ్‌కి కూడా వస్తుండటంతో ఆయన మరింతగా కృంగిపోయాడు. తాను ఏ కూతురు కోసం ఇదంతా చేశానో.. ఆమె లేనప్పుడు ఈ జీవితం ఇంకెందుకు అనుకున్నాడో ఏమో  తెలీదు కానీ.. గారెల్లో.. విషం కలుపుకుని తిని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక భార్య గిరిజ తనకు కలిగిన వేదనను భరించలేకపోతోంది. ఇటు భర్త  శాశ్వతంగా దూరం కాగా.. అటు కూతురు తన దగ్గర లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఇక నేను ఎవరికోసం జీవించాలంటూ రోదిస్తుంటే… ఎవరికైనా గుండె తరుక్కుపోవడం ఖాయం. కనీసం భర్త చనిపోయినప్పుడైనా.. కూతురు తల్లి దగ్గరకి వెళ్తే బావుంటుందని అందరూ అనుకున్నారు. కానీ.. అమృత ఇంటికి వెళ్లలేదు. శ్మశాన వాటికకు వెళ్లింది. అయితే మారుతీ రావు కుటుంబసభ్యులు అడ్డుకోవడంతో.. ఆమె తండ్రిని చివరిసారిగా చూడకుండానే వెనుదిరిగింది.

ఎవరి దారి వారు చూసుకున్నారు. మధ్యలో దోషి కాకపోయినా.. మారుతీరావు భార్య గిరిజ ఇప్పుడు శిక్ష అనుభవిస్తుంది.  బహుశా.. తాను మరణించిన తరువాతైనా.. అమృత ఇంటికి తిరిగి వస్తుందని.. భావించాడేమో మారుతీ రావు.. సూసైడ్ లెటర్‌లో.. అమ్మ దగ్గరకు వెళ్లు అని రాశాడు. ఇప్పుడు ఒంటరైన తల్లి దగ్గరకు.. అమృత తిరిగి వస్తుందా లేదా అని అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఈ కథకు ముగింపు ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.

ఇది కూడా చదవండి: శ్మశాన వాటికలో ఉద్రిక్త పరిస్థితులు.. కడసారి చూపుకు నోచుకోని అమృత

Read More this also: ఆయన్ని కొడితే రోజాకు మంత్రి పదవి గ్యారెంటీ.. ఆనందంలో రోజా!

Read More: మళ్లీ ప్రేమలో పడ్డ టాలీవుడ్ విలన్! ఈయనది 51.. ఆమెది 33

ఇది కూడా చదవండి: జగన్, చంద్రబాబులపై మంచు విష్ణు హాట్ కామెంట్స్..