Geetanjali : సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించిన నటి గీతాంజలి.. డేటింగ్ యాప్‌లో ఫొటోలు పెట్టి తీవ్రంగా వేధిస్తున్నారని కంప్లైంట్
Actress Geetanjali police case : టాలీవుడ్ వర్థమాన సినీ నటి గీతాంజలి పోలీసులను ఆశ్రయించింది...
Actress Geetanjali police case : టాలీవుడ్ వర్థమాన సినీ నటి గీతాంజలి పోలీసులను ఆశ్రయించింది. డేటింగ్ యాప్‌లో తన ఫొటోలు పెట్టడంతో పాటు తనను తీవ్రంగా వేధిస్తున్నారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. డేటింగ్ యాప్ కారణంగా తనకు అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పిన ఆమె, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీనికి సంబంధించి గీతాంజలి మీడియాతో మాట్లాడారు ‘ డేటింగ్ యాప్‌లో నా ఫోటో పెట్టినట్లు తెలిసింది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. సెలబ్రిటీల ఫోటోలు పెట్టుకుని డబ్బులు సంపాదించే వారిపై చర్యలు తీసుకోవాలి. మరో అమ్మాయికి ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని గీతాంజలి పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపీసీ 501 సెక్షన్ కింద హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నటి ఫిర్యాదుపై విచారణ చేపట్టామని ఏసీపీ ప్రసాద్ తెలిపారు. కాగా, టాలీవుడ్ నటి షకీలా బయోపిక్ ‘శీలవతి’వంటి కొన్ని సినిమాల్లో గీతాంజలి నటించారు.
Read also : TS Cabinet : 30న టీఎస్ క్యాబినెట్ భేటీ.. ఆ కీలక అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం