Crime: ప్రేమించాలని వేధించాడు.. ఆమె ఒప్పుకోకపోయేసరికి పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. చివరకు
యువతిని చూసి ఇష్టపడిన ఓ యువకుడు ఆమె ఫోన్ నంబర్ సంపాదించాడు. ఫ్రెండ్స్ గా ఉందామని నమ్మించాడు. ఆమె ఓకే అనడంతో మరింత రెచ్చిపోయాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నాక ప్రేమించాలని చెప్పాడు. యువతి ఒప్పుకోకపోవడంతో...
యువతిని చూసి ఇష్టపడిన ఓ యువకుడు ఆమె ఫోన్ నంబర్ సంపాదించాడు. ఫ్రెండ్స్ గా ఉందామని నమ్మించాడు. ఆమె ఓకే అనడంతో మరింత రెచ్చిపోయాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నాక ప్రేమించాలని చెప్పాడు. యువతి ఒప్పుకోకపోవడంతో తీవ్రంగా వేధించడం మొదలెట్టాడు. ఈ సారి యువతి తీవ్రంగా మందలించడంతో కోపం పెంచుకున్నాడు. రాత్రి సమయంలో నిద్రపోతున్న యువతిపై పెట్రోల్ పోసి నిప్పింటించాడు. జార్ఖండ్ రాష్ట్రంలోని దుమ్కా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి నివాసముండేది. ఆ గ్రామంలోనే ఉండే షారుక్ హుస్సేన్ ఆ యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడుతుండేవాడు. తననూ ప్రేమించాలని యువతిని వేధించేవాడు. అతని ప్రేమను యువతి ఒప్పుకోకపోవడంతో షారుక్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆగస్టు 23 వ తేదీన ఆమె నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు చికిత్స కోసం యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ క్రమంలో ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.
విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు, కుటుంబసభ్యులు యువకుడితో ఘర్షణకు దిగారు. దీంతో దుమ్కాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక రాజకీయ నేతలు కూడా ఈ ఘటనపై స్పందించారు. వారూ రోడ్లపై వచ్చి ఆందోళన చేశారు. దీంతో పట్టణంలోని మార్కెట్లు మూతపడ్డాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేసి, నిరసనల్లో పాల్గొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు షారుక్ ను అరెస్టు చేశారు. కస్టడీ కోసం అతడ్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి, నిందితుడిని ఉరి తీయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు.
కాగా.. యువతి ఫోన్ నెంబరును షారుక్ తెలుసుకున్నాడు. తరచూ ఆమెకు ఫోన్ చేసి వేధించేవాడు. స్నేహితులుగా ఉందామని నమ్మించాడు. ఆమె ఒప్పుకునేసరికి కొన్ని రోజుల తర్వాత ప్రేమించాలని వేధించాడు. అందుకు యువతి ససేమిరా అనడంతో షారుక్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనకు ముందు ప్రేమను అంగీకరించకుంటే చంపేస్తానని బెదిరించేవాడని, ఇప్పడు అన్నంత పనీ చేశాడని మృతురాలి తండ్రి కన్నీటిపర్యంతమయ్యారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి