AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suryapet: సూర్యాపేట జిల్లాలో అమానుష ఘటన.. మహిళను వివస్త్రను చేసి, కారం చల్లి ఊరేగించిన తండావాసులు

సూర్యాపేట జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. సభ్య సమాజం తల దించుకునేలా వ్యవహరించారు తండావాసులు. హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఓ మహిళను దారుణంగా అవమానించారు.

Suryapet: సూర్యాపేట జిల్లాలో అమానుష ఘటన.. మహిళను వివస్త్రను చేసి, కారం చల్లి ఊరేగించిన తండావాసులు
Woman Undressed
Balaraju Goud
|

Updated on: Aug 30, 2021 | 6:43 AM

Share

Atrocities in Suryapet District: సూర్యాపేట జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. సభ్య సమాజం తల దించుకునేలా వ్యవహరించారు తండావాసులు. హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఓ మహిళను దారుణంగా అవమానించారు. మృతుని కుటుంబ సభ్యులు ప్రతీకారంతో ఆమెను వివస్త్రను చేసి కర్రలతో కొట్టుకుంటూ గ్రామంలో ఊరేగించారు. సూర్యాపేట జిల్లాలో శనివారం జరిగిన ఈ దారుణం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలం రాజునాయక్‌తండాకు చెందిన శంకర్‌నాయక్‌ జూన్‌ 13న హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన యువతి హత్య కేసులో ఒక నిందితురాలిగా అరెస్టయ్యారు. శంకర్‌నాయక్‌ బంధువులతో ఆమెకు పాతకక్షలున్నాయి. బాధితురాలు ఇటీవల బెయిలుపై విడుదలై సూర్యాపేటలోని తన సోదరి ఇంట్లో తలదాచుకుంటున్నారు. అయితే, రాజునాయక్‌ తండాకు చెందిన బంధువు ఒకరు శనివారం మృతిచెందడంతో ఆ మహిళ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గ్రామానికి వచ్చింది.

శంకర్‌నాయక్‌ హత్యానంతరం మొదటిసారిగా తండాకు వచ్చిన ఆమెను చూసి కోపోద్రిక్తులైన అతడి బంధువులు దాడి చేశారు. ఆమెను ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి వివస్త్రను చేశారు. కళ్లల్లో కారం చల్లి, కర్రలతో కొడుతూ నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. నడిరోడ్డులో దాదాపు గంటసేపు జరిగిన ఈ అమానుషాన్ని ఎవరూ అడ్డుకోలేకపోయారు. ఎట్టకేలకు వారి నుంచి తప్పించుకున్న బాధిత మహిళ.. ఎంపీటీసీ సభ్యురాలు శాంతాబాయి ఇంటికి పరుగులు తీసింది. శాంతాబాయి ఆమెకు దుస్తులిచ్చి గదిలో రక్షణ కల్పించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు తండాకు వచ్చారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ బాధితురాలిని సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాజునాయక్ తండాకు చెందిన లునావత్‌ భారతి, బానోతు జ్యోతి, లునావత్‌ పద్మ, జ్యోతి, సునీత, పింప్లి, రాజేష్‌, సుప్రియ, కిషన్‌, మరో బాలిక తనపై దాడికి పాల్పడ్డారని తెలిపింది. సర్పంచి, గ్రామపెద్దలు చూస్తున్నా అడ్డుకోలేదని పేర్కొంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సూర్యాపేట గ్రామీణ ఎస్సై లవకుమార్‌ తెలిపారు.

Read Also….  Viral Video: బాప్ రే తాతలా మజాకా.. ఈ ఏజ్‌లోనూ ఇంత ఎనర్జీనా.. వీడియో చూస్తే షాక్ అవుతారు..