Viral Video: బాప్ రే తాతలా మజాకా.. ఈ ఏజ్‌లోనూ ఇంత ఎనర్జీనా.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు భావోద్వేగంగా, కన్నీళ్లు తెప్పించేవిగా ఉంటే..

Viral Video: బాప్ రే తాతలా మజాకా.. ఈ ఏజ్‌లోనూ ఇంత ఎనర్జీనా.. వీడియో చూస్తే షాక్ అవుతారు..
Fighting
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Aug 30, 2021 | 6:13 AM

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు భావోద్వేగంగా, కన్నీళ్లు తెప్పించేవిగా ఉంటే.. మరికొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉండి నెటిజన్లకు పసందు చేస్తాయి. సంతోషాన్నిస్తాయి. కడుపుబ్బా నవ్విస్తాయి. నెటిజన్లు ఇలాంటి ఫన్నీ వీడియోలను ప్రతీ రోజూ షేర్ చేస్తుంటారు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి ట్రెండింగ్‌లో ఉంది. ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోయి నోరెళ్లబెడతారు. ఇందులో ఇద్దరు పెద్ద మనుషుల అద్భుత పోరాట సన్నివేశం అందరినీ షాక్‌కు గురి చేస్తుంది.

సాధారణంగా ప్రజలు మద్దతు లేకుండా లేచి కూర్చోవడం కష్టమయ్యే వృద్ధాప్య వయసు వారిని. సరిగ్గా నడవలేని వయస్సులోనూ ఆ ఇద్దరు వృద్ధులు తీవ్రంగా పోరాడారు. వృద్ధుల ఫైటింగ్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వారికి సంబంధించిన వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఇద్దరు వృద్ధులు పొలంలో ముఖాముఖిగా నిలబడి ఉండటం ఈ వీడియోలో చూడవచ్చు. ఇద్దరూ ఒకరి ఎదురుగా మరొకరు నిలుచుని కుస్తీ పట్టారు. ఇలా కాసేపు ఇద్దరూ భీకరంగా తలపడ్డారు. వీరిరువురూ కుస్తీ పడుతుండగా.. పక్కనే ఉన్న మరికొందరు తమ ఫోన్‌ కెమెరాతో వీడియో తీశారు. ఆ వీడియోను కాస్త సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. కాగా, ఈ వీడియోలో ఆ వృద్ధుల పోరాటాన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. వీరిని మల్లయోధులుగా అభివర్ణించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘హైడర్‌ముల్తానీ 3’ అనే అకౌంట్‌లో ఈ షాకింగ్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను ప్రజలు చాలా ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. వారి శక్తి సామర్థ్యాలను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. వృద్ధుల ఫిట్‌నెస్, ఉత్సాహం చూసి ఫిదా అయిపోతున్నారు.

Viral Video:

Also read:

Maharashtra: మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్క రోజులో 18 చిన్నారులకు సోకిన మహమ్మారి..

Mumbai: ముంబైలో ఘోర ప్రమాదం.. పేలిన సిలిండర్.. 17 మందికి తీవ్ర గాయాలు..

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. స్నేహితుడే కాలయముడు అయ్యాడు.. గంజాయి మత్తులో కత్తెరతో..