Crime: చనుబాల తీపిని చూపిన తల్లే కట్టెతో కొట్టి.. మంటల్లో కాల్చేసింది.. మాయ మోజులో బిడ్డనే కాదనుకుంది..!

ఊరు కాని ఊరు వచ్చారు. ఇద్దరూ అనోన్యంగా ఉంటున్నారు. ఆరేళ్ల పాప కూడా ఉంది. అంతా బాగానే ఉందని ఊరి జనం కూడా అనుకున్నారు. కాని ఆ కసాయి తల్లి కళ్లలో కనికరంలేమిని కనిపెట్టలేకపోయారు. అంతా అయిపోయిన తర్వాత అసలు విషయం తెలిసి అయ్యో పాపం అనుకోవడం తప్పా ఏమి చేయలేని నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు.

Crime: చనుబాల తీపిని చూపిన తల్లే కట్టెతో కొట్టి.. మంటల్లో కాల్చేసింది.. మాయ మోజులో బిడ్డనే కాదనుకుంది..!
Crime
Follow us
T Nagaraju

| Edited By: Balaraju Goud

Updated on: Feb 13, 2024 | 7:19 PM

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పాపను అనైతిక బంధానికి అడ్డుస్తోందన్న అక్కసుతో చంపేసింది. చనుబాలు తీపి చూపిన తల్లే కట్టెతో కొట్టి ప్రాణం తీసింది. అంతేకాదు అనవాళ్ళు దొరకకుండా ఉండాలని ఏకంగా మంటల్లో కాల్చివేసింది. చివరికి చేసిన పాపం బయటకు తెలియకుండా ఉండాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. చుట్టు పక్కల వాళ్లకి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమివ్వడంతో కసాయి తల్లితో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు .

ఊరు కాని ఊరు వచ్చారు. ఇద్దరూ అనోన్యంగా ఉంటున్నారు. ఆరేళ్ల పాప కూడా ఉంది. అంతా బాగానే ఉందని ఊరి జనం కూడా అనుకున్నారు. కాని ఆ కసాయి తల్లి కళ్లలో కనికరంలేమిని కనిపెట్టలేకపోయారు. అంతా అయిపోయిన తర్వాత అసలు విషయం తెలిసి అయ్యో పాపం అనుకోవడం తప్పా ఏమి చేయలేని నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు.

ఆమె పేరు స్వప్న… ఊరు హైదరాబాద్‌లోని లాలాగూడా. అతని పేరు సిద్దార్ధ్. ఊరు కర్నూలు జిల్లా ఆలూరు. వీరిద్దరికి పరిచయం అయింది హైదరాబాద్ లోనే. కూలీ పనుల నిమిత్తం ఆలూరు నుండి హైదరాబాద్ కు వెళ్లిన సిద్దార్ధ్‌కు అక్కడ స్వప్న పరిచయం అయింది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటికే వివాహం అయిన స్వప్నకు ఆరేళ్ల కూతురుంది. హైదరాబాద్‌లో తమ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ జీవించడం కష్టంగా మారింది. దీంతో వీరిద్దరూ ఆరేళ్ల పాపను తీసుకుని తాడికొండ మండలం బండారుపల్లికి వచ్చారు. వచ్చి ఇరవై ఐదు రోజులైంది.

అయితే, ఆరు రోజుల క్రితం బండారుపల్లిలోని రైల్వే ట్రాక్ పక్కన ఏదో కాలిన ఆనవాళ్లు కనిపించాయి. కూలీ పనులు నిమిత్తం అటుగా వెళ్తున్న వారికి అక్కడ ఏం తగులబెట్టారో అర్ధం కాకుండా ఉంది. దీంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే స్వప్న, సిద్దార్ధ్‌ల వద్ద ఉండాల్సిన ఆరేళ్ల పాప కనిపించకపోవడంతో స్థానికులుకు అనుమానం వచ్చింది. ట్రాక్ పక్కన కాల్చి వేసింది చిన్నారినే అన్న అనుమానం బలపడింది. వెంటనే స్థానికులు ఈ విషయాన్ని తాడికొండ పోలీసులకు చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు యవ్వారం బయటపడింది.

హైదరాబాద్ నుండి ఇక్కడకి ఎందుకొచ్చారు. చిన్నారిని చంపాలన్న ఉద్దేశం ముందే ఉందా… ఎలా చంపారు అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేశారు. పోలీస్ మార్క్ విచారణలో అసలు విషయాలు బయటకు వచ్చాయి. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంతోనే కన్నబిడ్డను కసాయి తల్లే, ప్రియుడితో కలిసి చంపిదన్న నిర్ధారణకు పోలీసులు వచ్చారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసున్న పోలీసలుు, ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!