Diwali: పండుగ వేళ విషాదం.. మల్కాజ్‌గిరిలో చోటు చేసుకున్న ఘటన
హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో చోటు చేసుకుంది. దీపావళి సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలనుకున్నారు. కానీ విధి వక్రీకరించింది. దీపావళి సందర్భంగా ఇంట్లో దీపాలు ముట్టిస్తుండగా భార్య చీరకు నిప్పు అంటుకుంది. నిప్పును ఆర్పేందుకు ప్రయత్నించాడు ఆమె భర్త. తన భార్యను రక్షించే క్రమంలో ఈ నిప్పు తనకు అంటుకొని చనిపోయాడు.

దీపావళి అంటే వెలుగుల పండుగ. దేశమంతా టపాసులు కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సంఘటనల్లో కొన్ని సార్లు విషాద ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొందరు చేతులు కాల్చుకుంటూ ఉంటారు. ఒక్కో సారి టపాసులు నిప్పు ఎగిరి మీదపడి కాలిన గాయాల పాలవుతూ ఉంటారు. ఇలాంటి సంఘటన హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో చోటు చేసుకుంది. దీపావళి సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలనుకున్నారు. కానీ విధి వక్రీకరించింది. దీపావళి సందర్భంగా ఇంట్లో దీపాలు ముట్టిస్తుండగా భార్య చీరకు నిప్పు అంటుకుంది. నిప్పును ఆర్పేందుకు ప్రయత్నించాడు ఆమె భర్త. తన భార్యను రక్షించే క్రమంలో ఈ నిప్పు తనకు అంటుకొని చనిపోయాడు. ఈ విషాద సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రేమ్ విజయ్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది. పండుగ వేళ ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.