యూపీలో దారుణం.. భూవివాదంలో కాల్పులు.. 9మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. భూవివాదంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య దాదాపు గంటపాటు జరిగిన కాల్పుల్లో 9మంది మృతిచెందారు. మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని సోన్‌భద్ర జిల్లా ఘోరావర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సంఘర్షణలో దాదాపు వంద మంది ఉన్నట్లుగా స్థానిక వర్గాలు వెల్లడించాయి. ఈ సంఘటనపై ఓ ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ.. భూవివాదంలో […]
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. భూవివాదంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య దాదాపు గంటపాటు జరిగిన కాల్పుల్లో 9మంది మృతిచెందారు. మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని సోన్‌భద్ర జిల్లా ఘోరావర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సంఘర్షణలో దాదాపు వంద మంది ఉన్నట్లుగా స్థానిక వర్గాలు వెల్లడించాయి. ఈ సంఘటనపై ఓ ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ.. భూవివాదంలో ఈ ఘర్షణ తలెత్తింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నాం అని పేర్కొన్నారు.