నా భర్తే.. నన్ను చంపాలని ఇలా ప్లాన్ చేశాడు..!
హైదరాబాద్ బోడుప్పల్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన సంగీత కేసు కీలక మలుపు తిరిగింది. రోడ్డుపై వెళ్తున్న సంగీతను భర్త శ్రీనివాసరెడ్డే కారుతో యాక్సిడెంట్ చేయించినట్లుగా పోలీసులు నిర్థారించారు. శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సంగీతను ఢీ కొట్టిన కారు TS08 EC 3456 శ్రీనివాసరెడ్డిదిగా పోలీసులు గుర్తించారు. బోడుప్పల్‌కు చెందిన సంగీత పూర్తిగా కోలుకుంది. భర్త శ్రీనివాసరెడ్డి తనను కాదని వేరే యువతితో కాపురం చేస్తున్నాడని అత్తారింటి ముందు ఆందోళన చేపట్టింది. భర్త మెట్టింటి […]
హైదరాబాద్ బోడుప్పల్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన సంగీత కేసు కీలక మలుపు తిరిగింది. రోడ్డుపై వెళ్తున్న సంగీతను భర్త శ్రీనివాసరెడ్డే కారుతో యాక్సిడెంట్ చేయించినట్లుగా పోలీసులు నిర్థారించారు. శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సంగీతను ఢీ కొట్టిన కారు TS08 EC 3456 శ్రీనివాసరెడ్డిదిగా పోలీసులు గుర్తించారు.
బోడుప్పల్‌కు చెందిన సంగీత పూర్తిగా కోలుకుంది. భర్త శ్రీనివాసరెడ్డి తనను కాదని వేరే యువతితో కాపురం చేస్తున్నాడని అత్తారింటి ముందు ఆందోళన చేపట్టింది. భర్త మెట్టింటి వేధింపులపై గత రెండేళ్లుగా సంగీత న్యాయ పోరాటం చేస్తోంది. ఆమెను వదిలించుకునేందుకు భర్త యాక్సిడెంట్ ప్లాన్ వేశాడు.
రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న సంగీత తన గోడు మీడియాకు చెప్పుకుంది. తన భర్త శ్రీనివాసరెడ్డి వైఖరిలో ఇంకా మార్పు రాలేదని.. తనను హతమార్చేందుకు కుట్ర పన్నాడని తెలిపింది. తనపై రోడ్డు యాక్సిడెంట్ చేయించింది తన భర్తేనని చెప్పింది. తన భర్త నుంచి తనకు ప్రాణ హాని ఉందని.. ఎన్ని బెదిరింపులకు గురిచేసినా న్యాయం దక్కే వరకు పోరాటం చేస్తానంటుంది సంగీత.