AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గర్ల్స్ హాస్టల్‌లో ఘోస్ట్… అర్ధరాత్రి అరుపులు!

ఓ అర్ధరాత్రి వేళ బాలికల అరుపులతో వసతి గృహం దద్దరిల్లిపోయింది. అరుపులు, కేకలు హాస్టల్‌లో నుంచి హాహాకారాలు. ఇక కొద్ది దూరంలో ఉన్న జనం ఈ అరుపులను విని… ఏమి జరుగుతోందోనని అక్కడికి పరుగు పరుగున వెళ్లారు. అసలు అక్కడ ఏమి జరిగింది..? ఎందుకు బాలికలు భయంతో అరిచారు… అసలు వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు శివార్లలో ఉన్న ఓ బాలికల వసతి గృహం నుంచి అర్ధరాత్రి అరుపులు వినిపించాయి. అక్కడ ఉన్న సిబ్బందికి ఏమి జరుగుతోందో.. కొద్దిసేపు […]

గర్ల్స్ హాస్టల్‌లో ఘోస్ట్... అర్ధరాత్రి అరుపులు!
Ravi Kiran
|

Updated on: Jul 18, 2019 | 8:38 PM

Share

ఓ అర్ధరాత్రి వేళ బాలికల అరుపులతో వసతి గృహం దద్దరిల్లిపోయింది. అరుపులు, కేకలు హాస్టల్‌లో నుంచి హాహాకారాలు. ఇక కొద్ది దూరంలో ఉన్న జనం ఈ అరుపులను విని… ఏమి జరుగుతోందోనని అక్కడికి పరుగు పరుగున వెళ్లారు. అసలు అక్కడ ఏమి జరిగింది..? ఎందుకు బాలికలు భయంతో అరిచారు…

అసలు వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు శివార్లలో ఉన్న ఓ బాలికల వసతి గృహం నుంచి అర్ధరాత్రి అరుపులు వినిపించాయి. అక్కడ ఉన్న సిబ్బందికి ఏమి జరుగుతోందో.. కొద్దిసేపు అర్ధం కాలేదు. అయితే కాసేపటికి తేరుకుని.. అరుపులు వినిపించిన దిశగా వెళ్లారు. వారికి మరోసారి షాక్ కలిగేలా ఈసారి బయట నుంచి శబ్దాలు రావడం మొదలైయ్యాయి. నక్కలు, కుక్కలు, గుడ్లగూబల అరుపులు.. అందరికి కూడా వొళ్ళు జలదరించింది. కిటికీలు, తలుపులు వాటంత అవే దడదడ కొట్టుకుంటున్నాయి. ఈలోపు ఎక్కడ నుంచో ఘల్లు, ఘల్లుమంటూ గజ్జెల చప్పుడు రావడం మొదలైంది. ఇక ఈ శబ్దాలకు హాస్టల్‌లో ఉన్న బాలికలు భయబ్రాంతులకు లోనయ్యి.. ఏదో జరుగుతోందని భావించి.. కాపాడండి.. కాపాడండి అంటూ కేకలు వేయడం మొదలు పెట్టారు. మరోవైపు దూరం నుంచి ఓ బాలిక.. ‘బాబోయ్.. దెయ్యం’ అంటూ బిగ్గరగా అరుస్తూ కేకలు పెట్టింది. అసలు అక్కడ ఏమి జరుగుతోంది.. హాస్టల్‌లో నిజంగా దెయ్యం ఉందా..?

Follow Us