Crime News: నల్లగొండ జిల్లాలో విషాదం.. విక్స్ డబ్బా మింగిన శిశువు.. ఊపిరాడక..
7 Months old boy dies: తెలంగాణలోని నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఏడు నెలల పసికందు ఆడుకుంటూ విక్స్ డబ్బాను మింగి మరణించాడు. ఈ విషాద
7 Months old boy dies: తెలంగాణలోని నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఏడు నెలల పసికందు ఆడుకుంటూ విక్స్ డబ్బాను మింగి మరణించాడు. ఈ విషాద సంఘటన జిల్లా నార్కెట్‌పల్లి మండలం తొండ్లాయి గ్రామంలో చోటుచేసుకుంది. ఓ ఏడు నెలల పసికందు ఆడుకుంటూ.. తన ముందునున్న విక్స్ డబ్బాను మింగేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అప్రమత్తమై ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు. గొంతులో విక్స్ డబ్బా అడ్డుపడటంతో ఊపిరాడక దారిలోనే ఆ బాలుడు ప్రాణాలొదినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఇంట్లో సందడి చేస్తూ ఉండే తమ బిడ్డ ప్రాణాలొదలటంతో చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. అల్లారుముద్దుగా పెంచుకుందామనుకున్న శిశువు మరణించడటంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ సంఘటన పలువురిని కంటతడిపెట్టించింది.
Also Read: