Encounter: తెలంగాణ – ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి

Maoists killed in Encounter: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. జిల్లాలోని

Encounter: తెలంగాణ - ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి
Encounter
Follow us
Shaik Madar Saheb

| Edited By: Anil kumar poka

Updated on: Dec 27, 2021 | 12:10 PM

Maoists killed in Encounter: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. జిల్లాలోని చర్ల అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. మ‌ృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. గ్రేహౌండ్స్, మావోయిస్టుల మధ్య ఈ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. తెలంగాణ-ఛత్తీస్‌‌గడ్ సరిహద్దుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇంకా ఎన్‌కౌంటర్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

పెసర్లపాడు అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ దళాలు.. కూంబింగ్ నిర్వహిస్తుండగా.. ఆదివారం రాత్రి మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని.. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలోని కిస్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సల్స్ మృతి చెందినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ధ్రువీకరించారు.  తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసులు, సీఆర్‌పీఎస్ సంయుక్తంగా ఆపరేషన్  నిర్వహించాయని తెలిపారు.

Also Read:

Cyber Crime: క్రెడిట్ కార్డుపై రివార్డ్‌ పాయింట్స్‌ అంటూ మెస్సెజ్.. లింకు ఒపెన్ చేయగానే ఏమైందంంటే?

S.Thaman : ఈ సారి ప్రేమికుల రోజును ముందుగానే సెలబ్రేట్‌ చేసుకుందాం.. తమన్‌ ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌..