Delhi Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవదహనం

Delhi Fire Accident:  దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓల్డ్‌ సీమాపురిలో ఉన్న ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు..

Delhi Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవదహనం
Follow us
Subhash Goud

|

Updated on: Oct 26, 2021 | 8:08 AM

Delhi Fire Accident:  దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓల్డ్‌ సీమాపురిలో ఉన్న ఓ ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు సజీవదహనమయ్యారు. మరి కొందరు గాయపడినట్లు తెలుస్తోంది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మూడంతస్తుల భవనంలో భారీగా మంటలు వ్యాపించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుచ్చే ప్రయత్నం చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  అయితే ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా..? లేక మరేదైన కారణంగా జరిగిందా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ప్రమాదవశాత్తు కొన్ని అగ్ని ప్రమాదాలు జరగడం వల్ల ప్రాణ నష్టం, ఆస్తినష్టం సంభవిస్తోంది. షాట్‌సర్క్యూట్‌, ఇతర కారణాల వల్ల ప్రమాదాలు జరగడం భారీ ఎత్తున నష్టం సంభవిస్తున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత మంటలను అదుపులోకి తీసుకువచ్చినా.. జరిగే నష్టం జరిగిపోతుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు.

అయితే ఢిల్లీలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఆదివారం కూడా నైరుతి ఢిల్లీలోని పాలం గ్రామంలో ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురిని రక్షించారు. వీరిని రక్షించే క్రమంలో పోలీసులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అలాగే అక్టోబర్‌ 8న ఆగ్నేయ ఢిల్లీలోని ఓ గోదాంలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. ఓఖ్లా ఫేజ్‌2లోని హర్కేష్‌ నగర్‌లోని బట్టల గోదాంలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది 18 ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇలా ఢిల్లీలో రోజురోజుకు అగ్ని ప్రమాదాలు పెరిగిపోతున్నాయి.

ఇవి కూడా చదవండి:

Maoist Bandh Call: ములుగు ఎన్‌కౌంటర్ బూటకం.. 27న తెలంగాణ బంద్‌కు మావోల పిలుపు

Bank Holidays November 2021: కస్టమర్లకు అలర్ట్‌.. నవంబర్‌ నెలలో బ్యాంకులకు 17 రోజులు సెలవులు..!