AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: నాగర్‌ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం..

నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి దిమ్మెను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తోన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు

Road Accident: నాగర్‌ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం..
Accident
Basha Shek
|

Updated on: Apr 02, 2022 | 10:46 AM

Share

తెలంగాణలోని  నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి సిమెంట్ దిమ్మెను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తోన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చార గొండ మండలం తుర్కపల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయచర్యలు చేపట్టారు. కాగా మృతుల్లో ఇద్దరు మహిళలున్నారని, వీరంతా నల్గొండ జిల్లా నేరేడుచర్లకు చెందిన వారని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.