పెళ్లయిన రెండు వారాలకు పంతులుతో జంప్
భోపాల్: ఓ యువతి పెళ్లైన రెండు వారాలకు తనకు వివాహం జరిపించిన పంతులుతో లేచిపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. అసత్ గ్రామానికి చెందిన ఓ 21 ఏళ్ల రీనా భాయ్ అనే యువతిని అదే ప్రాంతానికి చెందిన యువకుడికి ఇచ్చి మే 7న వివాహం జరిపించారు. వీరి పెళ్లిని ఇదే ప్రాంతానికి చెందిన వినోద్ మహారాజ్ అనే పురోహితుడు జరిపించారు. పెళ్లయిన రెండు వారాలకు..సదరు మహిళ తనకు పెళ్లి జరిపించిన పురోహితుడితో కలిసి పారిపోయింది. ఆమె […]
భోపాల్: ఓ యువతి పెళ్లైన రెండు వారాలకు తనకు వివాహం జరిపించిన పంతులుతో లేచిపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. అసత్ గ్రామానికి చెందిన ఓ 21 ఏళ్ల రీనా భాయ్ అనే యువతిని అదే ప్రాంతానికి చెందిన యువకుడికి ఇచ్చి మే 7న వివాహం జరిపించారు. వీరి పెళ్లిని ఇదే ప్రాంతానికి చెందిన వినోద్ మహారాజ్ అనే పురోహితుడు జరిపించారు. పెళ్లయిన రెండు వారాలకు..సదరు మహిళ తనకు పెళ్లి జరిపించిన పురోహితుడితో కలిసి పారిపోయింది.
ఆమె ఇంటి నుంచి రూ.1.5 లక్షలు విలువ చేసే బంగారం, రూ.30వేల నగదు కూడా పట్టుకుపోయింది. వివాహితుడైన వినోద్‌కు ఇద్దరు పిల్లలు. రెండేళ్లుగా వారిద్దరూ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.