కరోనా పరీక్ష చేయించుకున్న విజయ సాయి రెడ్డి..!
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 405 కేసులు నమోదయ్యాయి. పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ప్రభావం ఉన్న ప్రాంతాల్లో కఠిన చర్యలకు ఉపక్రమించింది ప్రభుత్వం. ఈ క్రమంలో వైరస్ నియంత్రణ చర్యలను ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు.. ముందస్తు జాగ్రత్తలో భాగంగా పలువురు కరోనా టెస్టులు కూడా చేయించుకుంటున్నారు. తాజాగా తాడేపల్లిలోని నివాసంలో వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి కూడా కరోనా పరీక్షలు […]

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 405 కేసులు నమోదయ్యాయి. పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ప్రభావం ఉన్న ప్రాంతాల్లో కఠిన చర్యలకు ఉపక్రమించింది ప్రభుత్వం. ఈ క్రమంలో వైరస్ నియంత్రణ చర్యలను ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు.. ముందస్తు జాగ్రత్తలో భాగంగా పలువురు కరోనా టెస్టులు కూడా చేయించుకుంటున్నారు. తాజాగా తాడేపల్లిలోని నివాసంలో వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. శాంపిల్స్ తీసుకుని వైద్యులు పరీక్షించగా.. రిపోర్టులో ఆయనకు నెగిటివ్ అని తేలింది.