ఆగని తబ్లీఘీల ఆగడాలు.. నర్సులపైకి మాస్క్‌లు విసిరిన వైనం..!

ఆగని తబ్లీఘీల ఆగడాలు.. నర్సులపైకి మాస్క్‌లు విసిరిన వైనం..!

తబ్లీఘీ జమాత్ కార్యకర్తల ఆగడాలకు హద్దులేకుండా పోతోంది. ఇప్పటికే ఢిల్లీ, యూపీలో వీరు చేసిన ఆగడాలు అన్నీ ఇన్నీ కాదు.. కొందరు చికిత్స అందించే వైద్య సిబ్బందిపై ఉమ్మేస్తే.. వికృత చేష్టలకు దిగితే.. యూపీలో మరికొందరు నగ్నంగా మహిళా వైద్య సిబ్బంది ముందు అసభ్యంగా ప్రవర్తించారు. తాజాగా ఢిల్లీలో చెప్పడానికే అసహ్యమనిపించే విధంగా బాటిల్స్‌లో యూరిన్‌ పోస్తూ.. ఎక్కడ పడితే అక్కడ.. వికృత చేష్టలకు దిగారు. ఇప్పుడు..తమిళనాడులో కూడా వీరి ఆగడాలు మితిమీరిపోయాయి. కరోనా పాజిటివ్ ఉన్న […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 11, 2020 | 10:01 PM

తబ్లీఘీ జమాత్ కార్యకర్తల ఆగడాలకు హద్దులేకుండా పోతోంది. ఇప్పటికే ఢిల్లీ, యూపీలో వీరు చేసిన ఆగడాలు అన్నీ ఇన్నీ కాదు.. కొందరు చికిత్స అందించే వైద్య సిబ్బందిపై ఉమ్మేస్తే.. వికృత చేష్టలకు దిగితే.. యూపీలో మరికొందరు నగ్నంగా మహిళా వైద్య సిబ్బంది ముందు అసభ్యంగా ప్రవర్తించారు. తాజాగా ఢిల్లీలో చెప్పడానికే అసహ్యమనిపించే విధంగా బాటిల్స్‌లో యూరిన్‌ పోస్తూ.. ఎక్కడ పడితే అక్కడ.. వికృత చేష్టలకు దిగారు. ఇప్పుడు..తమిళనాడులో కూడా వీరి ఆగడాలు మితిమీరిపోయాయి. కరోనా పాజిటివ్ ఉన్న కొందరు తబ్లీఘీ జమాత్ కార్యకర్తలు.. ఆస్పత్రి డీన్‌ వద్దకు తమను వెళ్లనివ్వడం లేదని.. అక్కడి సిబ్బందితో ఘర్షణకు దిగారు. అంతటితో ఆగకుండా..విధుల్లో ఉన్న నర్సుపైకి మాస్కులు విసిరారు. తిరుచ్చిలోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వాసుపత్రి (ఎంజీఎంజీహెచ్)లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వీరి ఆగడాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు ఎకంగా స్థానిక మతపెద్దలు, నాయకులు వచ్చే వరకు ఆగలేదట.

అయితే పాజిటివ్‌తో ఉన్న కొందరు తబ్లీఘీ కార్యకర్తలు సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లో ఐసోలేట్‌లో ఉన్నారు. అయితే అక్కడ మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటూ ఆస్పత్రి డీన్‌ను కలవాలని వెంటనే అనుమతివ్వాలని గొడవ చేశారట. అంతటితో ఆగకుండా..కొందరు ఓ నర్సు పైకి మాస్కులను విసిరారంటూ.. ఆస్పత్రి యాజమాన్యం ఆరోపించింది. ఇదే సమయంలో జిల్లా కలెక్టర్ కూడా అదే ఆస్పత్రికి రావడంతో.. విషయాన్ని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు ఆస్పత్రి యాజమాన్యం. దీనిపై స్పందించిన కలెక్టర్.. వైద్యులు, సిబ్బందికి ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu