మరో షాకింగ్‌ న్యూస్‌.. ప్రార్ధనామందిరంలో దాక్కున్న 21మంది విదేశీయులు.. అందరికీ పాజిటివ్..!

మరో షాకింగ్‌ న్యూస్‌.. ప్రార్ధనామందిరంలో దాక్కున్న 21మంది విదేశీయులు.. అందరికీ పాజిటివ్..!

కరోనా మహమ్మారి ఎంతలా వ్యాపిస్తుందో అందరికీ తెలిసిందే. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో జరిగిన తబ్లీఘీ జమాత్‌ మీటింగ్‌ల అనంతరం.. ఈ పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు.. మరణాలు కూడా ఎక్కువగా నమోదయ్యాయి. మర్కజ్ సమావేశానికి వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛందంగా వచ్చి కరోనా టెస్టులు చేయించుకోవాలని ప్రభుత్వాలు ఎంత కోరినా.. వీ డోంట్ కేర్ అంటూ తప్పించుకు […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 11, 2020 | 8:50 PM

కరోనా మహమ్మారి ఎంతలా వ్యాపిస్తుందో అందరికీ తెలిసిందే. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో జరిగిన తబ్లీఘీ జమాత్‌ మీటింగ్‌ల అనంతరం.. ఈ పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు.. మరణాలు కూడా ఎక్కువగా నమోదయ్యాయి. మర్కజ్ సమావేశానికి వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛందంగా వచ్చి కరోనా టెస్టులు చేయించుకోవాలని ప్రభుత్వాలు ఎంత కోరినా.. వీ డోంట్ కేర్ అంటూ తప్పించుకు తిరుగుతున్నారు. అంతేకాదు.. కరోనా లక్షణాలు ఉన్నా కూడా.. ప్రార్ధనా మందిరాలతో పాటు.. వారికి సంబంధించిన పాఠశాలలో దాక్కుంటున్నారు.ఇప్పటికే ప్రభుత్వం.. మర్కజ్ సమావేశానికి ఎవరెవరు వెళ్లి వచ్చారన్న దానిపై ఓ లిస్ట్ ప్రిపేర్ చేసి.. వారందరినీ గుర్తించి.. క్వారంటైన్‌ సెంటర్లకు తరలిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ముంబైకి సమీపంలోని ముబ్రా పీఎస్ పరిధిలో బయటపడ్డ ఓ ఘటన.. ఆ ప్రాంతాన్ని వణికిస్తోంది.

పోలీసులు జరిపిన తనిఖీల్లో 21 మంది విదేశీయులు పట్టుబడ్డారు. వీరంతా మర్కజ్ సమావేశాలకు హాజరైనవారుగా తేలింది. వీరందరికి కరోనా టెస్టులు చేయగా.. పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే వారిని క్వారంటైన్‌కు తరలించి.. చికిత్స అందిస్తున్నారు. వీరందరికీ పాజిటివ్ అని తేలడంతో.. అప్రమత్తమైన ప్రభుత్వం.. వీరంతా ఎవరెవరిని కలిశారన్నదానిపై ఆరా తీస్తోంది.

కాగా, వీరికి ఆశ్రయం ఇచ్చన ప్రార్ధనా మందిరాలపై, పాఠశాల ట్రస్టీలపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పట్టుబడ్డ 21 మందిలో.. 13 మంది బంగ్లాదేశీయలు కాగా.. 8 మంది మలేషియకు చెందిన వారిగా గుర్తించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu