కోవిడ్ పై పోరులో ఐరాస ఎక్కడుంది ? ప్రధాని మోదీ

ప్రపంచాన్ని కుదిపివేస్తున్న కోవిడ్-19 పై పోరులో ఐరాస ఎక్కడుందని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ప్రపంచంలో పలు దేశాలు ఈ మహమ్మారితో తల్లడిల్లుతున్నాయని, కరోనా వైరస్ వ్యాక్సీన్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో..

  • Publish Date - 8:08 pm, Sat, 26 September 20 Edited By: Pardhasaradhi Peri
కోవిడ్ పై పోరులో ఐరాస ఎక్కడుంది ? ప్రధాని మోదీ

ప్రపంచాన్ని కుదిపివేస్తున్న కోవిడ్-19 పై పోరులో ఐరాస ఎక్కడుందని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ప్రపంచంలో పలు దేశాలు ఈ మహమ్మారితో తల్లడిల్లుతున్నాయని, కరోనా వైరస్ వ్యాక్సీన్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఇండియా ఒకటని ఆయన చెప్పారు. ఈ కారణంగా ఆయా దేశాలకు ఈ వ్యాక్సీన్ ను అందజేయడంద్వారా భారత్ సాయపడాలని భావిస్తోందని అన్నారు. ఐరాస జనరల్ అసెంబ్లీ డిబేట్ ను ఉద్దేశించి వర్చ్యువల్ గా మాట్లాడిన ఆయన.. తమ దేశంలో వ్యాక్సీన్ ట్రయల్స్ శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇక ఐక్యరాజ్యసమితికి ఇండియా ఇంకా ఎంతకాలం దూరంగా ఉండాలని కూడా మోదీ అన్నారు. ఈ సంస్థ తీసుకునే నిర్ణయాల్లో తాను కూడా భాగస్వామిగా ఉండాలని ఇండియా కోరుతోందని ఆయన చెప్పారు. సీమాంతర ఉగ్రవాదం,  దానికి పాకిస్థాన్ తోడ్పాటు తదితరాలను ఆయన ప్రస్తావించారు.