కరోనా వైరస్ …ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్ఛరిక

కరోనా వైరస్ పై పోరులో ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా ఉద్యమించకపోతే సమీప భవిష్యత్తులో 20 లక్షల కోవిడ్ మరణాలు తప్పకపోవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్ఛరించింది. సాధ్యమైనంత త్వరగా సమర్థవంతమైన..

కరోనా వైరస్ ...ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్ఛరిక
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 26, 2020 | 8:33 PM

కరోనా వైరస్ పై పోరులో ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా ఉద్యమించకపోతే సమీప భవిష్యత్తులో 20 లక్షల కోవిడ్ మరణాలు తప్పకపోవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్ఛరించింది. సాధ్యమైనంత త్వరగా సమర్థవంతమైన వ్యాక్సీన్ రావలసి ఉందని ఈ సంస్థ ఎమర్జెన్సీస్ ప్రోగ్రాం హెడ్ మైక్ ర్యాన్ అన్నారు. ఇరవై లక్షల మరణాలు అన్నది ఊహ కాదు, ఇందుకు అవకాశం ఉంది అని ఆయన నొక్కి చెప్పారు. గత తొమ్మిది నెలలుగా  కోవిడ్-19 విజృంభిస్తోందన్నారు. టెస్టుల సంఖ్యను మరింత పెంచవలసి ఉందన్నారు. బ్రిటన్ వంటి దేశాల్లో లాక్ డౌన్ ని ఇప్పటికీ వేలాది మంది వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వైరస్ తగ్గుతుందని ఎలా ఆశిస్తామన్నారు. ఐరాస వంటి సంస్థలు ఇప్పటికైనా చొరవ తీసుకుని ఈ మహమ్మారి కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు.