సీరియల్ షూటింగులకు.. క్వారంటైన్ నిబంధన.. వేరే రాష్ట్రాల హీరోయిన్ల సంగతేంటి.?

లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా, సీరియల్ షూటింగులకు అనుమతి ఇవ్వాలని తాజాగా టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ సీఎం కేసిఆర్‌కు విజ్ఞప్తి చేయగా.. ఆయన దానికి సానుకూలంగా స్పందించి మొదటిగా తక్కువ మందితో, ఇన్‌డోర్‌లో చేసే వీలున్న ప్రొడక్షన్ పనులు ప్రారంభించుకోవాలని సూచించిన సంగతి తెలిసిందే. తర్వాత దశలో జూన్‌లో షూటింగులు ప్రారంభించాలని తెలిపారు. అటు లాక్ డౌన్ నిబంధనలు, కరోనా వ్యాప్తి నివారణకు అనుసరిస్తున్న మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఇదిలా ఉంటే కరోనా కారణంగా […]

  • Ravi Kiran
  • Publish Date - 1:24 pm, Wed, 27 May 20
సీరియల్ షూటింగులకు.. క్వారంటైన్ నిబంధన.. వేరే రాష్ట్రాల హీరోయిన్ల సంగతేంటి.?

లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా, సీరియల్ షూటింగులకు అనుమతి ఇవ్వాలని తాజాగా టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ సీఎం కేసిఆర్‌కు విజ్ఞప్తి చేయగా.. ఆయన దానికి సానుకూలంగా స్పందించి మొదటిగా తక్కువ మందితో, ఇన్‌డోర్‌లో చేసే వీలున్న ప్రొడక్షన్ పనులు ప్రారంభించుకోవాలని సూచించిన సంగతి తెలిసిందే. తర్వాత దశలో జూన్‌లో షూటింగులు ప్రారంభించాలని తెలిపారు. అటు లాక్ డౌన్ నిబంధనలు, కరోనా వ్యాప్తి నివారణకు అనుసరిస్తున్న మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.

ఇదిలా ఉంటే కరోనా కారణంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నవారు ఖచ్చితంగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని నిబంధనను విధించారు. ఈ నేపధ్యంలో సినిమా, సీరియల్ షూటింగులు మునపటిలానే ఈజీగా జరుగుతాయా? లేదా? అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అయితే తెలుగు సినిమా, సీరియల్స్‌లో అందరూ తెలుగు ఆర్టిస్ట్స్ నటించేవారు. కానీ ఇప్పుడు సినిమాలతో పాటు సీరియల్స్‌లో మెయిన్ క్యారెక్టర్స్ చేసేవాళ్లందరూ దాదాపుగా పక్క రాష్ట్రాల వారే ఉన్నారు. ఇప్పుడు టీవీ సీరియల్ షూటింగ్ ప్రారంభించాలంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి హీరోయిన్‌లు రావాల్సి ఉంటుంది. మరి వాళ్లు వస్తే..? ఇక్కడ క్వారంటైన్‌లో ఉండాలంటే.? ఎలా షూటింగ్‌లో పాల్గొంటారు.? అనే విషయాలను కళ్యాణ వైభోగం హీరో విజే సన్నీ టీవీ9తో పంచుకున్నారు.

మిగిలిన ప్రొఫెషనల్ సెక్టార్ల మాదిరిగానే సినిమా ఇండస్ట్రీలో కూడా కరోనా అంటే కొంచెం భయం ఉంటుందని సన్నీ తెలిపారు. పరిశ్రమలో చాలామంది నటులతో దగ్గరగా పని చేయాల్సి వస్తుందన్న ఆయన.. కరోనా వ్యాప్తి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. ఇప్పటివరకూ అందరూ కూడా క్వారంటైన్‌లోనే ఉన్నారని.. జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారని.. అలాంటప్పుడు వేరే రాష్ట్రంలో ఉన్న కరోనాను వారు తీసుకురారని అన్నారు. కానీ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఆ రాష్ట్రం వారు ఇక్కడి ఎలా వస్తారన్నది మాత్రం తనకు కూడా తెలుసుకోవాలని ఉందని సన్నీ స్పష్టం చేశారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే చూడండి.