అమెరికా చేతిలో కరోనా వ్యాక్సిన్..! ట్రంప్ కీలక ప్రకటన

రోజురోజుకూ విస్తరిస్తోన్న కరోనా వైరస్‌‌ని నివారించేందుకు ప్రపంచ దేశాలూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటన అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది...

  • Jyothi Gadda
  • Publish Date - 11:43 am, Fri, 20 March 20
అమెరికా చేతిలో కరోనా వ్యాక్సిన్..! ట్రంప్ కీలక ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణమృదంగం మెగిస్తొంది. మొత్తం మరణాల సంఖ్య 10,033కు చేరింది. పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,45 850. కాగా 87 వేలకు పైగా బాధితులు కరోనా నుంచి కొలుకుంటున్నారు. అయితే చైనాను ఇటలీ మించిపోయింది. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 3,405. చైనా 3,245.-ఇరాన్‌ 1,284.-స్పెయిన్‌ -831. అయితే ఇండియాలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మన దేశంలో కరోనా పాటిజివ్‌ కేసులు 174 కాగా, ఐదుగురు మరణించారు. 20 మంది కొలుకుంటున్నారు. రోజురోజుకూ విస్తరిస్తోన్న కరోనా వైరస్‌‌ని నివారించేందుకు ప్రపంచ దేశాలూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటన అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది.

మందులేని మహమ్మారి కరోనాను నిరోధించేందుకు ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన అన్ని దేశాల్లోనూ ఆసక్తిని రేపుతోంది. కొవిడ్‌-19కు మలేరియా చికిత్సలో వాడే క్లోరోక్విన్‌ సమర్థవంతంగా పనిచేస్తోందని ట్రంప్ ప్రకటించారు. దీన్ని కరోనా చికిత్సకు ఉపయోగించేందుకు ఎఫ్‌డీఏ ఆమోదం కూడా తెలిపినట్టు ట్రంప్ పేర్కొన్నారు. కరోనా వైరస్ సోకిన చాలా మంది రోగులకు తక్షణమే క్లోరోక్విన్‌ను వినియోగించడానికి ఎఫ్‌డీఐ ఆమోదించినట్లుగా వెల్లడించారు. ఇప్పటికిప్పుడు ఈ ఔషధాన్ని అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు, ఎఫ్‌డీఐ అనుమతి కోసం ఇతర యాంటీవైరల్ ఔషధాలను కూడా గుర్తించనున్నట్టు తెలిపారు.