కరోనా ఎఫెక్ట్.. మందుబాబుల తెలివి చూస్తే షాక్‌..!

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బారినపడి 10 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో రెండున్నర లక్షల మందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు. గత నెల రోజుల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల గురించి తెలిసిందే. ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటించాలని ప్రభుత్వాలే సూచిస్తున్నాయి. జన సమూహంలో ఉన్నప్పుడు కనీస దూరం ఉండేలా ఉంటే ఈ కరోనాకు చెక్ పెట్టొచ్చని.. ఎవరికి వారే ముందస్తు జాగ్రత్తలు తీసుకుని కరోనా బారినపడకుండా రక్షణ […]

కరోనా ఎఫెక్ట్.. మందుబాబుల తెలివి చూస్తే షాక్‌..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 20, 2020 | 1:46 PM

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బారినపడి 10 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో రెండున్నర లక్షల మందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు. గత నెల రోజుల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల గురించి తెలిసిందే. ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటించాలని ప్రభుత్వాలే సూచిస్తున్నాయి. జన సమూహంలో ఉన్నప్పుడు కనీస దూరం ఉండేలా ఉంటే ఈ కరోనాకు చెక్ పెట్టొచ్చని.. ఎవరికి వారే ముందస్తు జాగ్రత్తలు తీసుకుని కరోనా బారినపడకుండా రక్షణ తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే స్కూళ్లు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, సినిమా థియేటర్లు మూసివేశారు.

అంతేకాదు.. మందుబాబులు ఒకేచోట కలవకుండా బార్లు కూడా మూతపడ్డాయి. అయితే పలుచోట్ల లిక్కర్ షాపులు తెరిసే ఉంటున్నాయి. అయితే చాలాచోట్ల లిక్కర్ షాపులు కిక్కిరిసిపోతాయన్న విషయం తెలిసిందే. మరి ఎప్పుడు కిక్కిరిసిపోయే లిక్కర్ షాపులు పరిస్థితి చూస్తే షాక్ తినాల్సిందే. దాదాపు అన్ని వైన్స్ షాపుల వద్ద మందుబాబులు బారులుతీరి ఉంటారు. మరి అందులో ఎవరైనా కరోనా సోకి ఉంటే పరిస్థితి ఏంటి..? అందుకే మందుబాబులకు ఓ ఐడియా వచ్చింది. అదేంటంటే.. ఎంచక్కా క్యూ లైన్లు పాటిస్తూ.. మందుబాటిళ్లను కొనగోలు చేయడమే. పైన ఉన్న చిత్రం కేరళ రాష్ట్రానికి చెందింది. అక్కడ మద్యం షాపులు కిక్కిరిసిపోతుంటాయి. దీంతో మందుబాబుల కరోనా వ్యాప్తి చెందకుండా.. సామాజిక దూరం పాటిస్తున్నారు. షాపుల వద్ద ఒకరికి మరొకరికి మధ్య.. కనీసం ఒక మీటర్‌ దూరం ఉండేలా నిలబడుతున్నారు. ఈ క్రమంలో షాపు యజమానులు కూడా.. అందుకనువుగా క్యూలైన్‌లో ముగ్గుతో గీతలను కూడా గీసి ఉంచారు. ఈ క్యూలైన్‌లో నిలబడ్డ మందుబాబులు.. కొందరు ముఖాలకు చేతులు అడ్డుపెట్టుకుని వస్తే.. కర్చీఫ్‌ కట్టుకుని మరికొందరు కనిపిస్తున్నారు. అయితే వీరందర కంటే ముందుజాగ్రత్త వహిస్తూ.. ఓ వ్యక్తి మాత్రం అందరికంటే భిన్నంగా ఏకంగా హెల్మెట్‌ ధరించి క్యూలైన్లో నిలబడ్డాడు. ఈ ఫోటోలు చూస్తున్న నెటిజన్లు.. మందుబాబుల తెలివికి జోహార్లు అంటున్నారు.