ఆ మూడు జిల్లాలకు శ్రీవారి లడ్డూలు..

శ్రీవారి దర్శనానికి దూరమైన భక్తులకోసం లడ్డూ ప్రసాదాన్ని విక్రయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 వ తేదీనుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లా కేంద్రాల్లో...

  • Pardhasaradhi Peri
  • Publish Date - 4:52 pm, Sat, 23 May 20
ఆ మూడు జిల్లాలకు శ్రీవారి లడ్డూలు..

శ్రీవారి దర్శనానికి దూరమైన భక్తులకోసం లడ్డూ ప్రసాదాన్ని విక్రయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 వ తేదీనుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న టీటీడీ కళ్యాణమండపాల్లో లడ్డూ విక్రయాలు చేయనున్నారు. మొదటివిడతగా ప్రతిజిల్లాకేంద్రానికి 20 వేల లడ్డూలు పంపించింది.

ఇందులో ముందుగా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు పంపించింది. తిరుమల నుంచి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని టీటీడీ కల్యాణ మండపాలకు శ్రీవారి లడ్డూలను మూడు లారీల్లో తరలించారు. లడ్డూలు తరలిస్తున్న మూడు లారీలకు ఉదయం టీటీడీ అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి పూజలు నిర్వహించిన అనంతరం 1,10,000 లడ్డూలను ఈ లారీల ద్వారా మూడు జిల్లాలకు పంపించారు. అంతేకాకుండా… తెలంగాణ, తమిళనాడు, కర్నాటక ప్రభుత్వాలు అనుమతిస్తే.. లడ్డూలు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.