అంతర్జాతీయ విమాన సర్వీసులు ఎప్పటి నుంచి అంటే ?

దేశంలో కరోనా వైరస్ కేసులు అదుపులోకి వఛ్చిన పక్షంలో జూన్ రెండో వారం (మధ్యకాలం) నుంచి గానీ, జులై నుంచి గానీ  అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కావచ్ఛునని పౌర విమాన యాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి తెలిపారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచీ విమానాశ్రయాల్లోనే ఉండిపోయిన విమానాలను పునరుధ్ధరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఆన్ లైన్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ ఆయన.. అన్నీ అనుకూలించిన పక్షంలో అంతర్జాతీయ విమాన సర్వీసులకు సంబంధించి […]

అంతర్జాతీయ విమాన సర్వీసులు ఎప్పటి నుంచి అంటే ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 23, 2020 | 4:41 PM

దేశంలో కరోనా వైరస్ కేసులు అదుపులోకి వఛ్చిన పక్షంలో జూన్ రెండో వారం (మధ్యకాలం) నుంచి గానీ, జులై నుంచి గానీ  అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కావచ్ఛునని పౌర విమాన యాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి తెలిపారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచీ విమానాశ్రయాల్లోనే ఉండిపోయిన విమానాలను పునరుధ్ధరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఆన్ లైన్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ ఆయన.. అన్నీ అనుకూలించిన పక్షంలో అంతర్జాతీయ విమాన సర్వీసులకు సంబంధించి జులై లేదా ఆగస్టు వరకు ఎందుకు వేచి ఉండాలని ప్రశ్నించారు. ఈ వైరస్ తో మనం ‘సహజీవనానికి’ అలవాటు పడితే.. మనం అనుకున్నట్టు ఈ కేసులు కంట్రోల్ అయిన పక్షంలో .. ఇక విమానాల పునరుధ్ధరణ ఏర్పాట్లకు సిధ్ధంగా ఉన్నాం అని ఆయన చెప్పారు.

కాగా-సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులను పునరుద్జరిస్తున్నట్టు హర్ దీప్ సింగ్ పురి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విమాన ప్రయాణికులకు క్వారంటైన్ అవసరం లేదన్న ఆయన వ్యాఖ్యలపై కేరళ, అస్సాం, కర్ణాటక సహా అప్పుడే కొన్ని రాష్ట్రాలు అభ్యంతరాలను ప్రకటించాయి. ఆయా రాష్టాల నుంచి వచ్ఛే విమాన ప్రయాణికులు ఏడు రోజులు ప్రభుత్వ క్వారంటైన్ లోను, మరో ఏడు రోజులు హోమ్ క్వారంటైన్ లోను ఉండాలని కర్ణాటక ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. ఇక తమిళనాడు రాష్ట్రమైతే.. విమాన సర్వీసుల పునరుధ్ధరణపై పునరాలోచించాలని కేంద్రాన్ని కోరింది.

హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.