బ్రేకింగ్: ఫేక్ న్యూస్‌లపై ఆరోగ్య మంత్రి ఫైర్.. శిక్షలు తప్పవు
వాట్సాప్ గ్రూపులో హల్‌చల్ చేస్తున్న కరోనా అసత్య ప్రచారాలపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజెేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చెప్పిన తర్వాత కూడా అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై..
వాట్సాప్ గ్రూపులో హల్‌చల్ చేస్తున్న కరోనా అసత్య ప్రచారాలపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజెేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చెప్పిన తర్వాత కూడా అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. నగరంలో ముగ్గురికి కరోనా వచ్చిందని సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో అసత్య ప్రచారాలపై పోలీసులకి కంప్లైంట్ చేశారు మంత్రి ఈటెల. దీంతో.. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
కాగా దీనిపై స్పందించిన హైదరాబాద్ పోలీసులు.. జర్మనీ, ప్రాన్స్, ఇటలీ, చైనా వచ్చే వారికి స్క్రీనింగ్ చేస్తున్నామన్నారు. కరోనాపై పుకార్లును వ్యాపింప చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. వదంతులు నమ్మి భయాందోళనకు గురి కావద్దని, అనుమానితులకు కిట్టు ఇస్తున్నామన్నారు. అందులో బాడిని పూర్తిగా కవర్ చేసేందుకు మాస్క్, గ్లౌసులు ఉంటాయని పేర్కొన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఇప్పటివరకు 64 వేల మందికి టెస్టులు నిర్వహించామని, 24 గంటలూ 200 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు.
పెళ్ళిల్లు, శుభకార్యాలు చేసుకునే వాళ్ళు తక్కువ మందిని పిలుచుకుని నిర్వహించుకుంటే బాగుంటుందన్నారు. ఏడు దేశాలనుండి వచ్చే ప్రయాణికులను క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు. వారిని 14 రోజులు పాటు అబ్జర్వేషన్‌లో పెట్టి.. కరోనా లేదని ప్రూవ్ అయితేనే జన సమూహంలోకి వదిలి పెడుతున్నట్లు చెప్పారు. హెల్త్, ట్రాన్స్పోర్ట్ శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్నామని వారు పేర్కొన్నారు.
కాగా.. కరోనా ధాటికి ప్రపంచమంతా అతలాకుతలమౌవుతోంది. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా 110 కేసులు నమోదయ్యాయి. దీంతో.. ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అలాగే ఏపీలో కూడా ఇద్దరికి కరోనా పాజిటీవ్ కేసు నమోదుకాగా, తెలంగాణలో ఒకరికి కరోనా సోకినా.. దాన్నినుంచి బయటపడ్డాడు. అనంతరం డాక్టర్ల సూచనలమేరకు ఆ వ్యక్తి చికిత్స తీసుకుంటున్నాడు. దీనికి తోడు సోషల్ మీడియాల్లో వైరస్‌పై వస్తున్న ఊహాగానాలు, వదంతులతో ప్రజల భయాందోళనలు మరింత పెరుగుతున్నాయి. అందుకే.. మంత్రి ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More this also: సిల్వర్ స్క్రీన్‌పై ‘కరోనా’ మూవీ
ఫ్లూ, జలుబు, కరోనాల మధ్య తేడాలు ఇవే!
‘కరోనా’ రావడం మంచిదేనా? ఆ వైరస్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా!
రోజా టైమింగ్‌కి దిమ్మ తిరగాల్సిందే!
అవకాశం కోసం వెళ్తే.. ఓ నిర్మాత పడకగదికి రమ్మన్నాడు: హీరోయిన్ సంచలన కామెంట్స్..