సిల్వర్ స్క్రీన్‌పై ‘కరోనా’ మూవీ
సాధారణంగా.. ప్రపంచంలో ఏదైనా విషయం సంచలనమైతే.. వాటిపై సినిమాలు రావడం కొత్తేమీ కాదు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని దిశ ఘటన, మిర్యాలగూడలో ప్రణయ్-అమృతల ప్రేమ వ్యవహారం..
సాధారణంగా.. ప్రపంచంలో ఏదైనా విషయం సంచలనమైతే.. వాటిపై సినిమాలు రావడం కొత్తేమీ కాదు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని దిశ ఘటన, మిర్యాలగూడలో ప్రణయ్-అమృతల ప్రేమ వ్యవహారం సంచలనాలు సృష్టించిన విషయం తెలిందే. ఇప్పటికే వీటిపై సినిమాలు తీయడం ప్రారంభమైయింది. ఇప్పుడు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేసిన.. కరోనాపై కూడా ఓ సినిమా రాబోతుందట. అంతేకాదు.. దీనికి సంబంధించి టైటిల్ కూడా రిజిస్టర్ అయ్యింది.
ప్రస్తుతం ప్రపంచ దేశాలను కలవరం పెడుతోన్న.. కరోనాపై దర్శకనిర్మాతలు సినిమాలు తెరకెక్కించడానికి సిద్ధమౌతున్నట్లు సమాచారం. ఈక్రమంలోనే ‘క్రిషిక లుల్లా’ అనే మహిళా నిర్మాత ‘కరోనా ప్యార్ హై’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించిందట. ఈ విషయం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే కనుక నిజమైతే కరోనా మీద వచ్చే తొలి సినిమా ఇదే అవుతుంది. ఇక దీన్ని ఆధారంగా చేసుకుని.. ఎన్ని సినిమాలు రానున్నాయో.
Read More this also: ఫ్లూ, జలుబు, కరోనాల మధ్య తేడాలు ఇవే!
‘కరోనా’ రావడం మంచిదేనా? ఆ వైరస్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా!
రోజా టైమింగ్‌కి దిమ్మ తిరగాల్సిందే!
అవకాశం కోసం వెళ్తే.. ఓ నిర్మాత పడకగదికి రమ్మన్నాడు: హీరోయిన్ సంచలన కామెంట్స్..