బ్రేకింగ్ః తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు భూమన. గత వారం రోజులుగా తనను కలిసిన కార్యకర్తలు టెస్టులు చేయించుకోవాలని, లక్షణాలున్నవారు హోమ్ ఐసోలేషన్‌లోనే ఉండాలని..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తూనే ఉంది. రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలవుతోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఇక అందులోనూ పలువురు రాజకీయ నాయకులు వరుస పెట్టి కోవిడ్ మహమ్మారి బారిన పడుతూనే ఉంటున్నారు.
తాజాగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. భూమాన కరుణాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అభినయ్ రెడ్డికి కూడా కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. గత వారం రోజులుగా కరోనాపై అనేక అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు భూమన. తనను కలిసిన కార్యకర్తలు టెస్టులు చేయించుకోవాలని, లక్షణాలున్నవారు హోమ్ ఐసోలేషన్‌లోనే ఉండాలని ఆయన సూచనలు చేశారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు కూడా వైద్యులు కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. కాగా ఇటీవలే ప్రముఖ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని భూమన కరుణాకర్ రెడ్డి ప్రార్థనలు కూడా చేశారు.
Also Read:
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కరోనా పాజిటివ్