క‌రోనాతో జ‌గిత్యాల ఎస్పీ ద‌క్షిణామూర్తి మృతి

క‌రోనా వైర‌స్‌తో జ‌గిత్యాల అద‌న‌పు ఎస్పీ ద‌క్షిణామూర్తి మృతి చెందారు. ఇటీవ‌లే కోవిడ్ బారిన ప‌డిన ఆయ‌న‌.. క‌రీంన‌గ‌ర్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ద‌క్షిణామూర్తి ఆరోగ్య ప‌రిస్థితి క్షీణించ‌డంతో..

క‌రోనాతో జ‌గిత్యాల ఎస్పీ ద‌క్షిణామూర్తి మృతి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 26, 2020 | 9:04 AM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇక అందులోనూ పలువురు రాజ‌కీయ నాయ‌కులు, సినీ, క్రీడా సెల‌బ్రిటీలు వ‌రుస పెట్టి కోవిడ్ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతూనే ఉంటున్నారు. ఇందులో కొంత‌మంది ఈ వైర‌స్ తీవ్ర‌త‌ను త‌ట్టుకోలేక మ‌ర‌ణిస్తున్నారు కూడా. తాజాగా క‌రోనా వైర‌స్‌తో జ‌గిత్యాల అద‌న‌పు ఎస్పీ ద‌క్షిణామూర్తి మృతి చెందారు. పోలీసు శాఖ‌లో బందోబ‌స్తులో ద‌క్షిణా మూర్తి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించేవారు. గ‌త 25 ఏళ్లుగా మేడారం జాత‌ర స‌మ‌యంలో బందోబ‌స్తులో ద‌క్షిణా మూర్తి కీల‌క‌పాత్ర వ‌హించారు. ఇటీవ‌లే కోవిడ్ బారిన ప‌డిన ఆయ‌న‌.. క‌రీంన‌గ‌ర్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ద‌క్షిణామూర్తి ఆరోగ్య ప‌రిస్థితి క్షీణించ‌డంతో నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ నెలాఖ‌రున ప‌ద‌వీ విర‌మ‌న పొంద‌నున్నారు అద‌న‌పు ఎస్పీ ద‌క్షిణా మూర్తి.

Also Read:

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కరోనా పాజిటివ్

ఆ ప్ర‌భుత్వ‌ ఉద్యోగులకు సీఎం జ‌గ‌న్‌ గుడ్ న్యూస్‌

బిగ్‌బాస్-4 కంటెస్టెంట్‌కి కరోనా పాజిటివ్?

కరోనా వైరస్‌తో ఆర్మీ జవాను మృతి