తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ
ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయనికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా.. గత 24 గంటల్లో కొత్తగా 9,927 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,71,639కి చేరింది. ఇక ప్రస్తుతం 89,932 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,75,352 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా సోకి 92 మంది మరణించగా..
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గత కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ఓ రేంజ్‌లో నమోదవుతున్నాయి. ఇక అందులోనూ పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా సెలబ్రిటీలు వరుస పెట్టి కరోనా వైరస్ బారిన పడుతూనే ఉంటున్నారు. అయితే మరికొంత మంది మాత్రం ఈ వ్యాధి తీవ్రతను తట్టుకోలేక మరణిస్తున్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయనికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా.. గత 24 గంటల్లో కొత్తగా 9,927 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,71,639కి చేరింది. ఇక ప్రస్తుతం 89,932 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,75,352 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా సోకి 92 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 3460కి చేరింది.
ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 494, చిత్తూరులో 967, తూర్పు గోదావరిలో 1353, గుంటూరులో 917, కడపలో 521, కృష్ణాలో 322, కర్నూలులో 781, నెల్లూరులో 949, ప్రకాశంలో 705, శ్రీకాకుళంలో 552, విశాఖలో 846, విజయనగరంలో 6670, పశ్చిమ గోదావరిలో 853 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ మళ్లీ పెరుగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 2,579 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,670కు చేరింది. 24 గంటల్లో 9 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 770కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,752 మంది డిశ్చార్జ్ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 84,163కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 23,737 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 52933 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 10,21,054కు చేరింది.
జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 295, ఆదిలాబాద్ 34, భద్రాద్రి కొత్తగూడెం 83, జగిత్యాల్ 98, జనగాం 46, జయశంకర్ భూపాలపల్లి 12, జోగులమ్మ గద్వాల్ 47, కామారెడ్డి 64, కరీంనగర్ 116, ఖమ్మం 161, కొమరం భీమ్ అసిఫాబాద్ 10, మహబూబ్ నగర్ 69, మహబూబాబాద్ 81, మంచిర్యాల్ 104, మెదక్ 42, మేడ్చల్ మల్కాజ్‌గిరి 106, ములుగు 16, నాగర్ కర్నూల్ 48, నల్గొండ 129, నారాయణ్‌పేట్ 19, నిర్మల్ 28, నిజామాబాద్ 142, పెద్దంపల్లి 85, రాజన్న సిరిసిల్ల 59, రంగారెడ్డి 186, సంగారెడ్డి 30, సిద్ధిపేట్ 92, సూర్యాపేట 78, వికారాబాద్ 23, వనపర్తి 56, వరంగల్ రూరల్ 31, వరంగల్ అర్బన్ 143, యాద్రాది భువనగిరి 46 కేసులు నమోదయ్యాయి.
Read More:
బ్రేకింగ్ః తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్