మరో ముగ్గురు ఐటీబీపీ సిబ్బందికి కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి భద్రతా బలగాలను కూడా వణికిస్తోంది. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ సిబ్బంది నిత్యం కరోనా బారినపడుతున్నారు. తాజాగా ముగ్గురు ఇండో టిబెటన్ బోర్డర్‌ పోలీసులు కరోనా బారినపడ్డారు. గడిచిన..

మరో ముగ్గురు ఐటీబీపీ సిబ్బందికి కరోనా పాజిటివ్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 07, 2020 | 12:20 AM

కరోనా మహమ్మారి భద్రతా బలగాలను కూడా వణికిస్తోంది. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ సిబ్బంది నిత్యం కరోనా బారినపడుతున్నారు. తాజాగా ముగ్గురు ఇండో టిబెటన్ బోర్డర్‌ పోలీసులు కరోనా బారినపడ్డారు. గడిచిన 24 గంటల్లో ఐటీబీపీకి చెందిన సిబ్బంది ముగ్గురు కరోనా బారినపడ్డట్లు అధికారులు కూడా సోమవారం నాడు అధికారికంగా వెల్లడించారు. ఇప్పటి వరకు ఐటీబీపీలో కరోనా కేసుల వివరాల గురించి తెలిపారు. ప్రస్తుతం 151 మంది కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారన్నారు. కరోనా నుంచి కోలుకుని 273 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారన్నారు.

కాగా, దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు రోజు వేలల్లో నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు లక్షలకు చేరువైంది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 24వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ లేకపోవడంతో.. కేసుల సంఖ్య నిత్యం పెరుగుతోంది.