గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం.. మరో ముగ్గురికి కోవిడ్..

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో పనిచేసే ముగ్గురు వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకింది.  సాధారణ ప్రజలతో పాటు వైద్య సిబ్బంది కూడా కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గాంధీ ఆస్పత్రిలోని సూపరింటెండెంట్ పీఏ, అసిస్టెంట్ పీఏ, నర్సుకు..

గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం.. మరో ముగ్గురికి కోవిడ్..
Follow us

| Edited By:

Updated on: Jun 26, 2020 | 6:45 PM

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో పనిచేసే ముగ్గురు వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకింది.  సాధారణ ప్రజలతో పాటు వైద్య సిబ్బంది కూడా కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గాంధీ ఆస్పత్రిలోని సూపరింటెండెంట్ పీఏ, అసిస్టెంట్ పీఏ, నర్సుకు కూడా కోవిడ్ ఉన్నట్లు తేలింది. కాగా ఇప్పటికే కేసుల సంఖ్య పెరుగుతుండటంతో హాస్పిటల్ సిబ్బంది తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు.

అలాగే ఈ రోజు ఆదిలాబాద్‌లో రిమ్స్ స్టాఫ్ నర్సుకు కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. వెంటనే ఆమె నివాసముంటున్న కాలనీని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు అధికారులు. హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో వైద్య సిబ్బంది కోవిడ్ బారిన పడుతున్నారు. పేట్లబురుజు హాస్పిటల్‌లో 30 మందికి పైగా కోవిడ్ ఇన్ఫెక్షన్‌కు గురి కాగా.. ఉస్మానియా డెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్, కొండాపూర్ ఏరియా ఆస్పత్రి సూరిండెంట్‌ కూడా కరోనా సోకింది. ఇక నిమ్స్ ఉస్మానియా మెడికల్ కాలేజీల్లో కూడా మెడికోలకు వైరస్ సోకుతుంది. ఇటీవలే ఖైరతాబాద్‌లో ఓ డాక్టర్ కోవిడ్ బారిన పడి చనిపోయారు.

Read More: 

నాసా బంపర్ ఆఫర్.. మూన్‌పై టాయిలెట్‌ కట్టేందుకు బెస్ట్ ఐడియా ఇస్తే..

‘గూగుల్ పే’లో కొత్త ఫీచర్.. అప్పులు ఇచ్చేందుకు సిద్ధం..

వీడియో వైరల్: బుల్లెట్ నడుపుతూ బోర్లాపడ్డ జెర్సీ హీరోయిన్..

బ్రేకింగ్: మరో సీరియల్ నటుడికి కరోనా.. షూటింగ్ రద్దు