Strain Virus: బ్రిటన్ నుంచి తెలంగాణకు 1200 మంది… 846 మందిని గుర్తించిన అధికారులు…

తెలంగాణ ప్రభుత్వం బ్రిటన్, ఆ దేశం మీదుగా తెలంగాణకు వచ్చిన ప్రయాణికులను గుర్తిస్తోంది. బ్రిటన్ నుంచి వచ్చిన వారిని గుర్తించి... వారికి పరీక్షలు నిర్వహించగా... ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

Strain Virus: బ్రిటన్ నుంచి తెలంగాణకు 1200 మంది... 846 మందిని గుర్తించిన అధికారులు...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 25, 2020 | 11:18 AM

Strain Virus: బ్రిటన్ నుంచి ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ నుంచి వచ్చిన వారిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా, తెలంగాణ ప్రభుత్వం బ్రిటన్, ఆ దేశం మీదుగా తెలంగాణకు వచ్చిన ప్రయాణికులను గుర్తిస్తోంది.

ఇప్పటి వరకు తెలంగాణకు దాదాపు 1200 మంది వచ్చినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పటికే వారిలో 846 మందిని గుర్తించారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారిని గుర్తించి… వారికి పరీక్షలు నిర్వహించగా… ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వారిని స్థానిక టిమ్స్ ఆస్పత్రికి తరలించి ప్రత్యేకంగా ఉంచారు.

కరోనా పాజిటివ్ వచ్చిన వారి రక్త నమూనాలను పూణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఇక, పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో ప్రాథమిక కాంటాక్ట్ ఉన్న వారిని నేచర్ క్యూర్‌కు తరలించారు. కాగా, బ్రిటన్ రిటర్న్స్ లో నెగిటీవ్ వచ్చిన వారిని కూడా మానిటరింగ్‌లో పెట్టారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ రాగా వారు హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, మేడ్చల్, జగిత్యాల జిల్లాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.