బ్రేకింగ్: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల..
తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. టీఎస్ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఒకేసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను ఈ ఏడాది విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 60.1 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా..
తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. టీఎస్ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఒకేసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను ఈ ఏడాది విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 60.1 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్‌లో 68.86 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,65,839 మంది పరీక్షలు రాశారు. వీరిలో సెకండ్ ఇయర్ విద్యార్థులు 4,85,323 మంది ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ.. రిజల్ట్స్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఇంటర్ పరీక్షా ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారని పేర్కొన్నారు. అలాగే సప్లిమెంటరీ పరీక్షల తేదీని త్వరలోనే వెల్లడిస్తామన్నారు మంత్రి సబిత.
Read More:
అశ్రు నయనాల మధ్య కల్నల్ సంతోష్ అంత్యక్రియలు పూర్తి…