Telangana Corona Virus : మళ్ళీ తెలంగాణాలో నెమ్మదిగా పెరుగుతున్న కరోనా కేసులు.. నేటి నుంచి వృద్ధులకు టీకా పంపిణీ

తెలంగాణాలో తాజాగా కరోనా కేసుల వివరాలను ప్రభుత్వ ఆరోగ్య శాఖ రిలీజ్ చేసింది.  రాష్ట్రంలో శనివారం రాత్రి 8గంటల వరకూ కొత్తగా 116 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకూ మొత్తం నమోదైన కేసుల సంఖ్య...

Telangana Corona Virus : మళ్ళీ తెలంగాణాలో నెమ్మదిగా పెరుగుతున్న కరోనా కేసులు.. నేటి నుంచి వృద్ధులకు టీకా పంపిణీ
Follow us
Surya Kala

|

Updated on: Mar 01, 2021 | 10:04 AM

Telangana Corona Virus : తెలంగాణాలో తాజాగా కరోనా కేసుల వివరాలను ప్రభుత్వ ఆరోగ్య శాఖ రిలీజ్ చేసింది.  రాష్ట్రంలో శనివారం రాత్రి 8గంటల వరకూ కొత్తగా 116 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకూ మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,98,923కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనాతో నిన్న ఎవరూ మృతి చెందలేదు. కరోనా బారి నుంచి నిన్న 165 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,95,387కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,902 ఉండగా.. వీరిలో 804 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రకటించింది. ఇక గత 24 గంటల్లో వరకు 20,375 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణాలో నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 87,21,026కి చేరింది.

జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 27 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 859 మంది వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే సీరం సర్వే నిర్వహించనుంది. తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న వారి శాతం 98.80కు చేరింది.

కాగా, దేశ వ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.4 శాతం ఉండగా, తెలంగాణలో మాత్రం 0.54 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. మరోవైపు ఈరోజు నుంచి తెలంగాణలో వృద్ధులకు, 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా టీకా పంపిణీ చేయనున్నారు. ఈ దశలో మొత్తం 50 లక్షల మందికి టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి వారం మాత్రం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారికి మాత్రమే టీకా వేస్తారు.

Also Read:

మళ్లీ షాక్ ఇచ్చిన చమురు సంస్థలు.. నాలుగు రోజుల గ్యాప్‌ అనంతరం పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు..

కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ టీకాను తీసుకున్న ప్రధాని మోదీ